కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (డీఏ- డియర్నెస్ అలొవెన్స్) లేదా అందులోని ఏ భాగాన్ని కూడా వారి మూల వేతనం (బేసిక్ పే)లో విలీనం చేసే ప్రణాళికను ప్రస్తుతం పరిశీలించడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఒక ప్రశ్నకు ఈ మేరకు స్పందించింది.

8వ వేతన సంఘం విధివిధానాలను (టీఓఆర్- టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రభుత్వం జారీ చేసిన కొద్ది రోజులకే ఈ వివరణ కూడా వచ్చింది.
"ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని మూల వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు," అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో శీతాకాల సమావేశాల సందర్భంగా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
"జీవన వ్యయాన్ని సర్దుబాటు చేయడానికి, ద్రవ్యోల్బణం కారణంగా అసలు విలువలో కోత పడకుండా మూల వేతనం/పెన్షన్‌ను రక్షించడానికి, ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ/డీఆర్ రేట్లను సవరిస్తారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో విడుదల చేసే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా ఈ సవరణ జరుగుతుంది," అని ఆ సమాధానంలో పంకజ్ చౌదరి పేర్కొన్నారు.
ఉద్యోగుల డిమాండ్లు, 8వ వేతన సంఘం స్థితి..
ఇటీవలి కాలంలో, అనేక ఉద్యోగుల సంఘాలు 50 శాతం డీఏను తక్షణమే మూల వేతనంలో విలీనం చేయాలని కేంద్రాన్ని కోరాయి! 8వ వేతన సంఘం 2027 తర్వాత మాత్రమే వచ్చే అవకాశం ఉన్నందున, డీఏను త్వరగా మూల వేతనంలో విలీనం చేయడం ద్వారా ప్రాథమిక జీతం పెరుగుతుందని, భవిష్యత్తులో డీఏ లెక్కలు సవరించిన మొత్తంపై జరుగుతాయని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.
దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించనున్న 8వ వేతన సంఘం విధివిధానాలకు (టీఓఆర్) కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 29న ఆమోదం తెలిపింది.
{{/usCountry}}దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించనున్న 8వ వేతన సంఘం విధివిధానాలకు (టీఓఆర్) కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 29న ఆమోదం తెలిపింది.
{{/usCountry}}ఈ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహించనున్నారు.
ఈ 8వ వేతన సంఘం 18 నెలల్లో తన సిఫార్సులను సమర్పించనుందని, ఇది జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత మీడియా సమావేశంలో తెలిపారు.
8వ వేతన సంఘం- కేంద్ర ఉద్యోగుల జీతాలు ఎంత పెరగవచ్చు?
కొత్త వేతన నిర్మాణంలో జీతాలు, పెన్షన్లు ఎంత లెక్కిస్తారు? అనేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తుంది. 8వ వేతన సంఘంలో అత్యంత చర్చనీయాంశమయ్యేది ఇదే.
7వ వేతన సంఘంలో (2016లో అమలు): అప్పుడు 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఉద్యోగులకు 157% పెరుగుదల లభించింది.
కనీస మూల వేతనం రూ. 7,000 నుంచి రూ. 18,000కి పెరిగింది.
ఒకవేళ అదే 2.57 ఫ్యాక్టర్‌ను తిరిగి ఇప్పుడు కూడా వర్తింపజేస్తే:
కనీస వేతనం రూ. 18,000 నుంచి ఏకంగా రూ. 46,260కి పెరగవచ్చు.
కనీస పెన్షన్ రూ. 9,000 నుంచి రూ. 23,130కి పెరగవచ్చు.
అయితే, ఈ పెరుగుదల వాస్తవానికి చాలా ఎక్కువ అవుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ, కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92కి దగ్గరగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అప్పుడు కనీస మూల వేతనం రూ. 34,560కి చేరుకుంటుందని అంచనా. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.