...
...
Next Story

8వ వేతన సంఘం: జనవరి 1 నుంచే పెరిగిన జీతాలు అందుతాయా? తెలుసుకోవాల్సిన నిజాలివే

8వ వేతన సంఘం సభ్యులను కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో, జనవరి 1 నుంచే జీతాలు పెరుగుతాయనే ఆశతో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, నిబంధనలు ఏం చెబుతున్నాయి? పెంపు ఎప్పటి నుంచి అమలవుతుంది? జీతాల పెరుగుదల ఎంత ఉండవచ్చు? వంటి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Dec 29, 2025, 16:16:23 IST
Advertisement

లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి (8th Pay Commission) సంబంధించి కీలక ముందడుగు వేసింది. ఇటీవలే ఈ కమిషన్ సభ్యులను ప్రకటించడంతో, ఇక జీతాల పెంపు ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కమిషన్ సభ్యులు వీరే..

8వ వేతన సంఘం: జనవరి 1 నుంచే పెరిగిన జీతాలు అందుతాయా? తెలుసుకోవాల్సిన నిజాలివే
8వ వేతన సంఘం: జనవరి 1 నుంచే పెరిగిన జీతాలు అందుతాయా? తెలుసుకోవాల్సిన నిజాలివే

కేంద్ర వేతన సంఘం చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్‌ను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా, ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా వ్యవహరిస్తారని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జనవరి 1 నుంచే జీతాలు పెరుగుతాయా?

కమిషన్ సభ్యుల ప్రకటన రాగానే చాలామందిలో ఒక అనుమానం మొదలైంది. రాబోయే జనవరి 1 నుంచే పెరిగిన జీతాలు అందుతాయా? అని. దీనిపై ఉన్న వాస్తవాలను ఒకసారి గమనిస్తే.. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వస్తాయి. ఈ లెక్కన చూస్తే, 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమలు కావాల్సి ఉంది. అక్టోబర్‌లో కేంద్ర క్యాబినెట్ విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది.

అంటే, రాబోయే జనవరి 1 నుంచి మీకు తక్షణమే జీతాలు పెరగవు. కానీ, 2026 జనవరి నాటికి కమిషన్ నివేదిక ఆలస్యమైనా, ఆ తేదీ నుంచే మీకు రావాల్సిన బకాయిలను (Arrears) ప్రభుత్వం చెల్లిస్తుంది.

జీతం ఎంత పెరిగే అవకాశం ఉంది?

సిఫార్సులు వెలువడటానికి కొంత సమయం పట్టినప్పటికీ, గతంలో కంటే ఈసారి వేగంగానే నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks