...
...
Next Story

CBSE revaluation 2026 : సీబీఎస్​ఈ క్లాస్ 12 విద్యార్థులకు అలర్ట్! రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్ ఓపెన్..

CBSE class 12 revaluation : సీబీఎస్​ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక! మార్కుల వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్​కి సంబంధించిన పోర్టల్​ని సీబీఎస్​ఈ మంగళవారం ఓపెన్​ చేసింది. ఫీజు సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jun 02, 2026 07:36 AM IST
Advertisement

12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం మార్కుల వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) బోర్డు మంగళవారం (జూన్ 2, 2026) యాక్టివేట్ చేసింది. తమ మార్కులతో సంతృప్తి చెందని, ఫలితాల పునఃపరిశీలన కోరుకునే విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది. దరఖాస్తు ప్రక్రియ, దానికి సంబంధించిన ఫీజు వివరాలు, గడువు సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..

సీబీఎస్​ఈ క్లాస్​ 12 రీ-ఇవాల్యుయేషన్ అప్డేట్స్..

సీబీఎస్​ఈ రీ-ఇవాల్యుయేషన్ అప్డేట్స్.. (Parveen Kumar/HT)
సీబీఎస్​ఈ రీ-ఇవాల్యుయేషన్ అప్డేట్స్.. (Parveen Kumar/HT)

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల తర్వాత, తమకు వచ్చిన మార్కులపై ఏవైనా సందేహాలు ఉన్న విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. అభ్యర్థులు బోర్డు కేటాయించిన ప్రత్యేక పోర్టల్ లింక్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

విద్యార్థుల సౌకర్యార్థం, ఎలాంటి తప్పులు చేయకుండా సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు సీబీఎస్‌ఈ ఒక 'స్టెప్-బై-స్టెప్ వీడియో గైడ్'ను కూడా విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియలో పొరపాట్లను నివారించడానికి, రిక్వెస్ట్ సబ్మిట్ చేసే ముందు విద్యార్థులు ఈ వీడియోను జాగ్రత్తగా చూడాలని బోర్డు సూచించింది.

మరీ ముఖ్యంగా ఈ ఏడాది పేపర్ల మూల్యాంకణంపై వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్కుల వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్​ కోసం విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం!

సీబీఎస్‌ఈ రీ-ఇవాల్యుయేషన్‌కు అప్లై చేసే విధానం..

స్టెప్ 1: ముందుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ను సందర్శించండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న 'Verification Link' లేదా 'Post Result Activities' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: వెంటనే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు రీ-ఇవాల్యుయేషన్, వెరిఫికేషన్ (Re-evaluation and Verification) కి సంబంధించిన డైరెక్ట్ లింక్‌లు కనిపిస్తాయి.

స్టెప్ 5: లాగిన్ అయిన తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే అప్లికేషన్ ఫారమ్‌లో మీరు ఏ సబ్జెక్టు లేదా ఏ ప్రశ్నలకు వెరిఫికేషన్/రీ-ఇవాల్యుయేషన్ కోరుకుంటున్నారో ఆ వివరాలను జాగ్రత్తగా పూరించండి.

స్టెప్ 6: అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత, నిర్దేశిత ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్ డిజిటల్ పేమెంట్ మోడ్ ద్వారా చెల్లించండి.

స్టెప్ 7: ఫీజు చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, అప్లికేషన్‌ను ఫైనల్ సబ్మిట్ చేసి, స్క్రీన్‌పై కనిపించే కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 8: భవిష్యత్తు అవసరాల కోసం ఆ కన్ఫర్మేషన్ పేజీ, ఒక హార్డ్ కాపీని (ప్రింటవుట్) మీ వద్ద సురక్షితంగా ఉంచుకోండి.

సీబీఎస్​ఈ క్లాస్​ 12 వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్ ఫీజు వివరాలు..

మార్కుల పునఃపరిశీలన, పునఃమూల్యాంకనం కోసం విద్యార్థులు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బోర్డు వెల్లడించిన ఫీజు వివరాలు కింది విధంగా ఉన్నాయి:

మార్కుల వెరిఫికేషన్ : ప్రతి ఆన్సర్ బుక్ (జవాబు పత్రం) కు రూ. 500/- చెల్లించాలి.

రీ-ఇవాల్యుయేషన్ : ప్రతి ప్రశ్నకు రూ. 100/- చెల్లించాల్సి ఉంటుంది.

సీబీఎస్​ఈ క్లాస్​ 12 రీ-వెరిఫికేషన్- పోర్టల్ గడువు ఎంతవరకు?

అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్కాన్ చేసిన, మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల చివరి కాపీని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన తర్వాత, కనీసం 2 రోజుల పాటు ఈ వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌ను ఓపెన్ ఉంచాలని బోర్డు భావిస్తోంది.

విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అర్హత ప్రమాణాలు, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. తాజా అప్‌డేట్‌ల కోసం విద్యార్థులు బోర్డు అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఫాలో అవ్వవచ్చు.

మరొక విషయం ఏంటంటే.. ఈ సర్వీసులు కేవలం 12వ తరగతికే పరిమితం కాదు. 10వ తరగతి విద్యార్థులు సైతం రీ-ఇవాల్యుయేషన్​, వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

సీబీఎస్​ఈ రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్​కి సంబంధించిన డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe