దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలతో హోరెత్తుతోంది. నీట్ 2026 (NEET) పేపర్ లీకేజీ, సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో జరిగిన అక్రమాలకు నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) శనివారం తన ప్రత్యక్ష పోరాటాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న విద్యాశాఖ వైఖరిని నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు.

"ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో" (ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి), "మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే.. మీరు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు" అంటూ నిరసనకారులు రాసిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ ఉధృత నిరసనల్లో పాల్గొనేందుకు CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నగరం నుండి శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని కనిపించడం విశేషం.
అనుమతి లభించింది..
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనను చేపట్టనున్నట్లు CJP అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.
"ఢిల్లీ పోలీసులు మా జంతర్ మంతర్ నిరసనకు అనుమతి ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా జంతర్ మంతర్ వద్దే గుమిగూడవచ్చు. బొద్దింకలు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు" అని నిరసనకారులు ట్వీట్ చేశారు.
శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన తెలుపుకునేందుకు ఢిల్లీ పోలీసులు అధికారికంగా అనుమతినిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి, ఒకేసారి మినహాయింపుగా ఈ అనుమతి ఇస్తున్నట్లు న్యూఢిల్లీ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
జూన్ 21న మళ్లీ నీట్ పరీక్ష
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్ష అక్రమాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షను రద్దు చేసి, తిరిగి జూన్ 21న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ముమ్మరంగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈ దర్యాప్తు ప్రగతిని వివరించారు. ఈ పరిణామాల మధ్య విద్యాశాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు గతంలో నిరసనలు తెలిపిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు కూడా జరిగాయి.
రాజుకున్న రాజకీయ కాక
{{/usCountry}}దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్ష అక్రమాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షను రద్దు చేసి, తిరిగి జూన్ 21న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ముమ్మరంగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈ దర్యాప్తు ప్రగతిని వివరించారు. ఈ పరిణామాల మధ్య విద్యాశాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు గతంలో నిరసనలు తెలిపిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు కూడా జరిగాయి.
రాజుకున్న రాజకీయ కాక
{{/usCountry}}పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్, రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని విద్యా వ్యవస్థను, విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం పణంగా పెడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఈ ‘కాక్రోచ్’ ఉద్యమం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేలా కనిపిస్తోంది.