దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జోసా (JoSAA) 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) లో ర్యాంకు సాధించిన విద్యార్థులు ఐఐటీ సీట్ల కోసం, జేఈఈ మెయిన్స్ అర్హులు ఎన్‌ఐటీ సీట్ల కోసం రేపటి (జూన్ 2) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్ల (Choice filling) ప్రక్రియ జూన్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవడానికి జూన్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చారు. జూన్ 7 నాటికి విద్యార్థులు నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా జూన్ 8న మొదటి మాక్ సీట్ అలాట్‌మెంట్ (Mock seat allotment) జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత జూన్ 10న రెండో మాక్ సీట్ అలాట్‌మెంట్ జాబితాను ప్రకటిస్తారు. దీనివల్ల విద్యార్థులకు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనా లభిస్తుంది.
జూన్ 13న మొదటి విడత సీట్ల కేటాయింపు
షెడ్యూల్ ప్రకారం జూన్ 13న రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు అదే రోజు నుంచి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయడం, ఫీజు చెల్లించడం, అవసరమైన పత్రాలను (Documents) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మొదటి విడత ఫీజు చెల్లింపునకు జూన్ 26వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. ఐఐటీల్లో సీటు సాధించాలనుకునే జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లందరూ ఈ సంయుక్త సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాల్గొనడం తప్పనిసరి. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ఐఐటీలు ఆఫర్ చేస్తున్న కోర్సుల పూర్తి వివరాలు ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో అందుబాటులో ఉంచుతారు.
జోసా కౌన్సెలింగ్ 2026కు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం
విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి క్రింది పద్ధతిని అనుసరించవచ్చు:
- మొదట జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న 'JoSAA Counselling 2026 Registration' లింక్‌పై క్లిక్ చేయండి.
- ఓపెన్ అయిన కొత్త పేజీలో మీ జేఈఈ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయండి.
- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపండి.
- నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
- అన్ని వివరాలను సరిచూసుకుని 'Submit' బటన్‌పై క్లిక్ చేయడంతో మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని, ఒక ప్రింటవుట్ దగ్గర ఉంచుకోండి.
- షెడ్యూలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి క్రింది పద్ధతిని అనుసరించవచ్చు:
- మొదట జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న 'JoSAA Counselling 2026 Registration' లింక్‌పై క్లిక్ చేయండి.
- ఓపెన్ అయిన కొత్త పేజీలో మీ జేఈఈ రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయండి.
- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపండి.
- నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
- అన్ని వివరాలను సరిచూసుకుని 'Submit' బటన్‌పై క్లిక్ చేయడంతో మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకుని, ఒక ప్రింటవుట్ దగ్గర ఉంచుకోండి.
- షెడ్యూలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}1. జోసా 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? చివరి తేదీ ఏది?
జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ జూన్ 2, 2026 న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి జూన్ 11, 2026 వరకు గడువు ఉంటుంది.
2. మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?
మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలను జూన్ 13, 2026న విడుదల చేస్తారు. సీటు వచ్చిన అభ్యర్థులు జూన్ 26, 2026 లోపు ఆన్‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
3. మాక్ సీట్ అలాట్‌మెంట్ జాబితాలను ఎప్పుడు ప్రకటిస్తారు?
విద్యార్థులు పెట్టుకున్న ఆప్షన్ల ఆధారంగా మొదటి మాక్ సీట్ అలాట్‌మెంట్ జాబితాను జూన్ 8న, రెండవ జాబితాను జూన్ 10న విడుదల చేస్తారు.