...
...
Next Story

మారుతీ సుజుకీ ఈ విటారా లాంచ్​ ఈ రోజే- ఈ 3 ఫీచర్లు హైలైట్​..!

మచ్​ అవైటెడ్​ మారుతీ సుజుకీ ఈ విటారా నేడు ఇండియాలో అధికారికంగా లాంచ్​ కాబోతోంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి ఈవీలకు గట్టిపోటీని ఇవ్వనుంది. కాగా ప్రత్యర్థులతో పోలిస్తే ఈ విటారాలో 3 ఫీచర్లు హైలైట్​గా నిలవనున్నాయి. వాటి గురించి ఇక్కడ చూసేయండి..

Published on: Dec 02, 2025 06:00 AM IST
Advertisement

మారుతీ సుజుకీ ఈ విటారాతో భారతీయ ఎలక్ట్రిక్​ వాహనాల మార్కెట్​లోకి గ్రాండ్​గా ఎంట్రీ ఇవ్వనుంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ మారుతీ సుజుకీ కొత్త ఈవీ ఈరోజు, డిసెంబర్​ 2న లాంచ్​కానుంది. మారుతీ కొత్త ఈవీ వ్యూహంలో భాగంగా రూపొందించిన ఈ ఎస్‌యూవీ, మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మహీంద్రా బీఈ 6 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ లాంచ్‌తో కంపెనీ తన ప్రొడక్షన్​ వ్యూహంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోనుంది.

మారుతీ సుజుకీ ఈ విటారా..
మారుతీ సుజుకీ ఈ విటారా..

ఈవీలను భారత్‌లో ఉత్పత్తి చేసి, సుమారు 100 దేశాలకు ఎగుమతులు చేయాలని మారుతీ సుజుకీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా అంతర్జాతీయ ఈవీ మార్కెట్‌లో అగ్రగామిగా మారాలనే ఆ కంపెనీ ఆశయాలకు ఈ-విటారా మరింత బలాన్ని ఇవ్వనుంది. భారతీయ ఈవీ మార్కెట్‌లో బలమైన ముద్ర వేయగల సామర్థ్యం ఈ ఎస్‌యూవీకి ఉంది. లాంచ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో, పోటీదారుల నుంచి మారుతీ సుజుకీ ఈ-విటారాను ప్రత్యేకంగా నిలబెట్టే మూడు ప్రధాన ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి..

అద్భుతమైన ఫీచర్లు: ఈ-విటారా స్పెషల్ ఏంటి?

1. ఆల్‌గ్రిప్-ఇ (ALLGRIP-e) 4WD సిస్టమ్

మారుతీ సుజుకీ తన ఆల్‌గ్రిప్-ఇ 4డబ్ల్యూడీ (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్​ని ఈ-విటారా ద్వారా భారతదేశంలో తొలిసారిగా పరిచయం చేయనుంది.

ఇది ప్రతి యాక్సిల్‌పై ఒక స్వతంత్ర ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. దీనివల్ల పవర్​ అనేది నాలుగు చక్రాలకు పంపిణీ అవుతుంది. అయితే ఈ ఫీచర్ కేవలం 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్‌లలో మాత్రమే లభిస్తుంది.

ఇందులో ట్రైల్ మోడ్ కూడా ఉంది. ఇది ఎంపిక చేసిన బ్రేకింగ్, టార్క్ పంపిణీ ద్వారా కఠినమైన రోడ్లపై వాహనం పట్టును (ట్రాక్షన్‌ను) పెంచుతుంది.

2. హార్టెక్ట్-ఇ (HEARTECT-e) ఆర్కిటెక్చర్

ఈ-విటారా ప్రత్యేకంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన కొత్త హార్టెక్ట్-ఇ ఆర్కిటెక్చర్​పై తయారైంది.

ఈ తేలికపాటి ప్లాట్‌ఫారమ్ కారణంగా, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫ్లాట్-ఫ్లోర్ డిజైన్ సాధ్యమైంది. దీనివల్ల క్యాబిన్ స్పేస్, లెగ్‌రూమ్ సంప్రదాయ పెట్రోల్/డీజిల్ (ఐసీఈ) వాహనాలకు దాదాపు సమానంగా ఉంటాయి.

ఇది హై-వోల్టేజ్ భద్రతా నిర్మాణాన్ని కలిగి ఉంది. అలాగే, ఇంటీరియర్ స్థలాన్ని పెంచడంలో సహాయపడేందుకు కాంపాక్ట్ ఓవర్‌హాంగ్స్‌ను అందిస్తుంది.

ఈ ప్లాట్‌ఫారమ్ 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లకు అనుకూలంగా ఉంటుంది.

49 కేడబ్ల్యూహెచ్ యూనిట్: 142 బీహెచ్‌పీ పవర్​, 193 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 344 కి.మీ డ్రైవింగ్ రేంజ్​ అందిస్తుంది.

61 కేడబ్ల్యూహెచ్ యూనిట్: 2డబ్ల్యూడీ వేరియంట్‌లో 172 బీహెచ్‌పీని అందిస్తుంది. అయితే, 4డబ్ల్యూడీ వేరియంట్ టార్క్ అవుట్‌పుట్‌ను 300 ఎన్​ఎం వరకు పెంచుతుంది. ఈ యూనిట్ ఒక్కసారి ఛార్జ్‌పై ఏకంగా 500 కి.మీ వరకు పరిధిని అందిస్తుందని మారుతీ చెబుతోంది.

3. మారుతీలో తొలిసారిగా లెవెల్-2 అడాస్​

మారుతీ సుజుకీ ఈ-విటారా లెవెల్-2 అడాస్​ (అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ అసిస్టెంట్​ సిస్టెమ్​) సూట్‌ను కలిగి ఉన్న భారతీయ తయారీదారు నుండి వచ్చిన మొట్టమొదటి కారు.

ఈ డ్రైవర్ సహాయక వ్యవస్థల్లో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సదుపాయాలు వినియోగదారులకు లభిస్తాయి.

ఈ ఈవీలో ప్రామాణిక భద్రతా ఫీచర్లుగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ముందు- వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.

లాటిన్ ఎన్‌క్యాప్ నుంచి ఈ ఈవీ ఇప్పటికే ఫోర్-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందినప్పటికీ, దీనికి ఇంకా భారత్ ఎన్‌క్యాప్ పరీక్ష జరగాల్సి ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe