...
...
Next Story

బాటిల్స్, కుర్చీలు విసిరేసి ఫ్యాన్స్ ర‌చ్చ‌-మెస్సీకి సారీ చెప్పిన సీఎం-ఏం జ‌రిగిందంటే?

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని చూసే అవకాశం దక్కలేదంటూ అభిమానులు కోల్ కతాలోని స్టేడియం ఆస్తులను ధ్వంసం చేయడం కలకలం రేపింది. బాటిల్స్, కుర్చీలకు తీసి విసిరేసారు. ఈ ఘటనపై మెస్సీకి సీఎం క్షమాపణ చెప్పడం సంచలనంగా మారింది.

Published on: Dec 13, 2025, 14:22:25 IST
Advertisement

దిగ్గజ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీని చూద్దామని వచ్చిన వేలాది మంది ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ కలిగింది. తమ అభిమాన ఆటగాడికి చూసుకునే అవకాశం దక్కకపోవడంతో కోపంతో ఊగిపోయారు. కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో రచ్చ చేశారు. బాటిల్స్, కుర్చీలు విసిరేశారు. ఈ ఘటన పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ కు గురయ్యారు. మెస్సీకి ఆమె క్షమాపణ తెలిపారు.

మెస్సీని చూడలేకపోవడంతో

మెస్సి ఫ్యాన్స్ రచ్చ (PTI/AFP)
మెస్సి ఫ్యాన్స్ రచ్చ (PTI/AFP)

కోల్‌కతా పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపం పట్ల తాను తీవ్రమైన షాక్‌కు గురయ్యామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. మెస్సీని సరిగ్గా చూసే అవకాశం దక్కకపోవడంతో, కొందరు అభిమానులు ఆగ్రహానికి లోనై యువభారతి క్రీడాంగణంలోకి సీసాలు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనపై మెస్సీకి, క్రీడాభిమానులకు తన క్షమాపణలు తెలియజేస్తున్నానని, తాను కూడా అదే కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్టేడియం వైపు వెళ్తున్నానని బెనర్జీ ఎక్స్ లో తెలిపారు.

మెస్సీకి సారీ

"ఈరోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి, షాక్‌కు గురయ్యాను. నా అభిమాన ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీని చూసేందుకు తరలివచ్చిన వేలాది మంది క్రీడా ప్రియులు, అభిమానులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నేను స్టేడియం వైపు వెళ్తున్నాను. ఈ దురదృష్టకర సంఘటనపై లియోనెల్ మెస్సీకి, అలాగే క్రీడా ప్రియులందరికీ, ఆయన అభిమానులకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను" అని మమతా బెనర్జీ ఎక్స్ లో పోస్టు చేశారు.

విచారణ కమిటీ

శనివారం (డిసెంబర్ 13) ఉదయం కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూశారు. కానీ స్టేడియంలో ఆయన 22 నిమిషాల పాటు మెరుపులా కనిపించి వెళ్ళిపోవడంతో, సరిగ్గా చూసే అవకాశం దక్కక నిరాశకు గురయ్యారు. స్టేడియంలోని పలువురు అభిమానులు ఏమో మెస్సీని నాయకులు, మంత్రులు చుట్టుముట్టి ఆయన సమయాన్ని దోచుకున్నారని ఆరోపించారు. దీంతో అభిమానులు ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూసేందుకు, మాట్లాడేందుకు వారి వంతు కోసం ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి టికెట్ ధరలు రూ.18,000 వరకు చేరాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe