...
...
Next Story

Vontimitta : నేడు ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణోత్సవం - భక్తులకు తలంబ్రాలు, శ్రీవారి ప్రసాదం పంపిణీ

Sri Sitarama Kalyanam at Vontimitta : ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు తలంబ్రాలు ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం సిద్ధం చేశారు.

Published on: Apr 1, 2026, 08:00:23 IST
Advertisement
<p>ఒంటిమిట్టలో ఇవాళ(ఏప్రిల్ 1) సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. </p>

ఒంటిమిట్టలో ఇవాళ(ఏప్రిల్ 1) సాయంత్రం 6. 30 నుండి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఏకశిలానగరంలో ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.శ్రీ సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారు.

కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణం, అన్నప్రసాదాలు అందజేస్తారు.

కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీలలో 60 వేల‌ మంది సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు సకాలంలో సేవలు అందెలా పారా మెడికల్ సిబ్బంది, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 28 కియోస్క్ లు (కౌంటర్లు) ఉంచారు.

నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేయగా… ఇందులో పాన‌కం, మ‌జ్జిగ‌, చ‌లివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ఉంటారు.

శ్రీ కోదండ‌రామ‌స్వామి వారి ఆల‌యం నుండి క‌ల్యాణ వేదిక వ‌ర‌కు భ‌క్తులు చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో న‌డిచేందుకు వీలుగా చలువ పందిళ్లు, నీటి పిచుకారి యంత్రాలు ఏర్పాటు చేశారు. ఆల‌య స‌మీపంలో 3 వేల మంది భ‌క్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్ల‌లో వెళ్ళెందుకు జ‌ర్మ‌న్ షెడ్డు సిద్ధం చేశారు.

టిటిడి విజిలెన్స్ విభాగం, అబ్జర్వేషన్ టీం, ఫైర్ సిబ్బంది 510 మంది, టిటిడి స్కౌట్స్ 200 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మంది సేవలు అందిస్తారు. అదేవిధంగా 235 సిసి కెమెరాలు, 12 డ్రోన్ లు, కామాన్ కమెండ్ కంట్రోల్ సెంటర్, మరో మూడు 3 స‌బ్ కంట్రోల్ రూమ్ ల నుండి పర్యవేక్షణ కొనసాగుతోంది. కళ్యాణానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కడప వైపు 13, తిరుపతి వైపు 5 చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.

శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. ఆలయం, కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో 38 వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులను ఉంచారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe