...
...
Next Story

TG Rythu Bharosa Scheme : రైతు భరోసా డబ్బుల కోసం చూస్తున్నారా..? మీకు మరో ఛాన్స్, వెంటనే దరఖాస్తు చేసుకోండి

Telangana Rythu Bharosa Scheme Applications : రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదలైన నేపథ్యంలో సర్కార్ మరో అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులకు మరో ఛాన్స్ ఇచ్చింది.ఇప్పటి వరకు రైతు భరోసా అందని రైతులు… మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

Published on: Mar 23, 2026 07:19 AM IST
Advertisement

రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదలైన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. వచ్చే 45 రోజుల్లోగా రైతులందరి ఖాతాల్లోకి నిధులు చేరిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రైతు భరోసా స్కీమ్ (image source istock)
రైతు భరోసా స్కీమ్ (image source istock)

రాష్ట్రంలో మెుత్తం 73 లక్షల మంది అన్నదాతలు ఉన్నారు. ఒక ఎకరం వరకు సాయం అందించేలా రూ.3590 కోట్లను విడుదల చేశారు. ఆదివారం సెలవు కారణంగా సోమవారం(ఇవాళ) రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2650 కోట్లు, మూడో విడుతలో రూ.2760 కోట్లను విడుదల చేస్తారు. మొత్తం 3 విడతల ద్వారా… రూ. 9 వేల కోట్లను జమ చేస్తారు.

కొత్త దరఖాస్తులకు అవకాశం:

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రైతు భరోసా పథకంలో లబ్ధిపొందని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేందుకు కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు మరో అవకాశం కల్పించింది. అర్హులైన రైతులు… మార్చి 25వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలని సూచించింది.

  • కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 28.02.2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
  • గతంలో రైతుబంధుకు దరఖాస్తు చేసి ఇప్పుడు బ్యాంకు ఖాతా నెంబరును మార్చుకునే వారు దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా అధికారులకు అందజేయాలి.
  • పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రైతు ఆధార్ కార్డుతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించాలి
  • అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల వద్ద లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
  • కొత్త దరఖాస్తుల వివరాలను కూడా వెంటనే నమోదు చేసి లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని ఏఈవోలు, వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
  • కొత్త దరఖాస్తులను పరిశీలించి… వారికి కూడా రైతుబంధు స్కీమ్ డబ్బులను అందజేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe