తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, సాధారణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడంతో పాటు సౌకర్యవంతమ ప్రయాణాన్ని అందించేందుకు మహారాష్ట్రలోని హుజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుచానూరు మధ్య 12 ప్రత్యేక రైళ్లను (రైలు సంఖ్యలు 07603/07604) నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ఈ ప్రత్యేక రైళ్లు 2026 జూలై 21వ తేదీ నుండి ఆగస్టు 26వ తేదీ వరకు పట్టాలెక్కనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా నడిచే ఈ రైళ్ల వల్ల ఉత్తర తెలంగాణ భక్తులతో పాటు కోస్తాంధ్ర ప్రయాణికులకు ఎంతో లబ్ధి చేకూరనుంది.
ప్రత్యేక రైళ్లు - వివరాలు :
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం నాందేడ్ - తిరుచానూరు మధ్య రెండు దిశలలో చెరో 6 సర్వీసుల చొప్పున మొత్తం 12 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- రైలు నంబర్ 07603 (నాందేడ్ – తిరుచానూరు ప్రత్యేక రైలు): ఈ రైలు జూలై 21 నుంచి ఆగస్టు 25 వరకు ప్రతి మంగళవారం నాందేడ్ నుంచి బయలుదేరుతుంది. ఇది మొత్తం 6 సర్వీసులు నడుస్తాయి.
- రైలు నంబర్ 07604 (తిరుచానూరు – నాందేడ్ ప్రత్యేక రైలు): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూలై 22 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి బుధవారం తిరుచానూరు నుంచి బయలుదేరి నాందేడ్ చేరుకుంటుంది. ఈ రూట్ లో కూడా 6 సర్వీసులను నడుపుతారు.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లలో కేవలం థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్ (Sleeper Class) కోచ్‌లను మాత్రమే ఏర్పాటు చేశారు. దీనివల్ల మధ్యతరగతి ప్రయాణికులకు బడ్జెట్ ధరలోనే రిజర్వేషన్ సదుపాయం లభించడమే కాకుండా…. ఏసీ ప్రయాణాన్ని కోరుకునే వారికి కూడా మెరుగైన ప్రయాణ అనుభూతి కలుగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం రెండు వైపులా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో ఆగనున్నాయి. ఇందులో ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు , రేణిగుంట రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం రెండు వైపులా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో ఆగనున్నాయి. ఇందులో ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు , రేణిగుంట రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
{{/usCountry}}"తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, విజయవాడ మీదుగా ఈ ప్రత్యేక రైలు నడపడం వల్ల ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు నేరుగా తిరుపతి పరిసర ప్రాంతాలకు చేరుకోవడానికి వీలు కలుగుతుంది," అని రైల్వే అధికారులు తెలిపారు.