...
...
Next Story

3 సెషన్లలో జూలై 8 నుంచి టీజీ సీపీజీఈటీ-2026 పరీక్షలు.. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా!

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజ) ప్రవేశాల కోసం నిర్వహించే.. టీజీ సీపీజీఈటీ-2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 8 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

Published on: Jun 27, 2026 11:38 AM IST
Advertisement

తెలంగాణలోని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) ప్రవేశాల కోసం నిర్వహించే.. టీజీ సీపీజీఈటీ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. కన్వీనర్ రాజేందర్ విడుదల చేశారు. జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రతీ రోజూ మూడు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షల తేదీలు, సెషన్ల వారీ వివరాలు cpget.tgche.ac.in, www.kakatiya.ac.in లో చూడవచ్చు.

టీజీ సీపీజీఈటీ-2026
టీజీ సీపీజీఈటీ-2026

టీజీ సీపీగెట్‌లో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ప్రవేశాలు పొందవచ్చు.

ఎగ్జామ్ ప్యాటర్న్

అన్ని సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలు 90 నిమిషాల వ్యవధితో ఉంటాయి. ప్రశ్నాపత్రంలో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ (మల్టీపుల్ ఛాయిస్) రకం ప్రశ్నలు ఉంటాయి.

ప్రవేశ పరీక్షలో సాధారణ బహుళైచ్ఛిక ప్రశ్నలతో పాటు, analogies, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్ ఒక పరిశోధనా అధ్యయనం / ప్రయోగం / సైద్ధాంతిక దృక్కోణం అవగాహన మొదలైన 3 లేదా 4 రకాల ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు బహుళ సమాధానాలతో ఉంటాయి. ఈ ప్రశ్నలు కేవలం ప్రవేశ పరీక్ష సిలబస్ నుండి మాత్రమే రూపొందిస్తారు.

ఎం.ఎస్.సి. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీలో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష నమూనా విషయానికొస్తే.. అభ్యర్థులు BCESFSG&M అనే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరు కావాలి. ఈ పరీక్షలో పార్ట్-ఎ (రసాయన శాస్త్రం, 40 మార్కులకు), పార్ట్-బి (బి.ఎస్.సి. స్థాయిలో ఐచ్ఛిక సబ్జెక్టులైన భౌతికశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, జన్యుశాస్త్రం, సూక్ష్మజీవశాస్త్రం, జీవరసాయన శాస్త్రం లలో ఒక ఐచ్ఛిక సబ్జెక్టు) 60 మార్కులకు ఉంటాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe