రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆదుకుంటుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టుగా వెల్లడించారు.

చేవెళ్ల ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు పొన్నం. ఈ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని వెల్లడించారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు కొన్ని మృతదేహాలను మాత్రమే పోలీసులు గుర్తించారని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
అంతకుముందు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫోన్‌లో మాట్లాడారు. టిప్పర్ రాంగ్‌రూట్‌లో వచ్చి బస్సును ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కంట్రోల్ రూమ్ నెంబర్లు
ప్రమాదం జరిగిన వెంటనే సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణాకమిషనర్, ఫైర్ డీజీకి ఆదేశాలు వెళ్లాయి. సచివాలయంలో కంట్రోల్‌రూమ్ నంబర్లు 9912919545, 9440854433గా ఉన్నాయి.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
ఈ ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. తాండూరు పట్టణంలోని గాందీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ప్రమాదంలో చనిపోయారు. తనూష, సాయి ప్రియ, నందిని మృతి చెందారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో ముగ్గురు చదువుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకుని.. కన్నీరుమున్నీరయ్యారు.
{{/usCountry}}ఈ ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. తాండూరు పట్టణంలోని గాందీనగర్‌కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ప్రమాదంలో చనిపోయారు. తనూష, సాయి ప్రియ, నందిని మృతి చెందారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో ముగ్గురు చదువుతున్నారు. తల్లిదండ్రులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకుని.. కన్నీరుమున్నీరయ్యారు.
{{/usCountry}}