...
...
Next Story

Electric Scooter : ఇంటర్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. టెన్త్ క్లాస్ మార్కులతో స్కాలర్‌షిప్!

Electric Scooter : తెలంగాణ విద్యా శాఖ ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, కొత్తగా పది మార్కులతో స్కాలర్‌షిప్ తీసుకురావాలని యోచిస్తోంది.

Published on: Mar 17, 2026 06:11 AM IST
Advertisement

ఈ విద్యా సంవత్సరం నుండి ప్రోత్సాహకంగా దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడానికి ఇంటర్మీడియట్ విద్యా శాఖ కొత్త పథకాన్ని ప్రతిపాదించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 1,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులైన విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

ఇంటర్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు
ఇంటర్ విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు

మారుమూల ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు కాలేజీలకు చేరుకోవడం ఇబ్బందిగా మారింది. దివ్యాంగులైన విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తే ఎంతగానో వారికి ఉపయోగకరంగా ఉంటుందని డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. ఈ స్కూటర్లు విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి సహాయపడతాయి. రోజువారీ ప్రయాణ కష్టాలను తగ్గిస్తాయన్నారు.

ముందుగా ఈ పథకానికి ప్రభుత్వాన్ని రూ.5 కోట్లు కోరారు అధికారులు. తరువాత ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేత కార్యాక్రమం ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని, డ్రాపౌట్ రేట్లను తగ్గించడంలో సహాయపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు విద్యార్థులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతించారు. నడవడానికి ఇబ్బందిపడుతున్నవారికి ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రోజూ కాలేజీకి వెళ్లేందుకు చాలా సహాయంగా ఉంటుందని అంటున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో దివ్యాంగులైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదించింది. జూనియర్ కళాశాలల్లోని బాలికల కోసం కొత్త స్కాలర్‌షిప్ పథకాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. 10వ తరగతి మార్కుల ఆధారంగా దాదాపు 40,000 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2,500 స్కాలర్‌షిప్‌లు అందుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe