...
...
Next Story

AP Inter Exams : ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త - సెకండియర్‌లోనూ ఇంప్రూవ్‌మెంట్‌, నేటి నుంచే ఎగ్జామ్ ఫీజు చెల్లింపులు

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు తీపి కబురు అందించింది. సెకండియర్‌లోనూ మార్కులు మెరుగుపరుచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు అవకాశం కల్పించింది. నేటి నుంచి ఏప్రిల్ 27 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. ఈ తేదీల్లోనే సప్లిమెంటరీ ఫీజు చెల్లించుకోవాలి.

Published on: Apr 20, 2026, 06:05:52 IST
Advertisement

ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ సర్కార్… మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం మొదటి సంవత్సరం (First Year) విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఇంప్రూవ్‌మెంట్’ పరీక్షలను సెకండియర్ విద్యార్థులకు కూడా అమలు చేయనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ఇంటర్ పరీక్షలు
ఏపీ ఇంటర్ పరీక్షలు

దేశంలోని ఇతర రాష్ట్రాల ఇంటర్ బోర్డులు అనుసరిస్తున్న విద్యా విధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం…. విద్యార్థులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ నిర్ణయంతో పైచదువుల ప్రవేశాల్లో (EAPCET, JEE, NEET వంటివి) మార్కుల వెయిటేజీ కోసం ఎదురుచూసే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

  • సప్లిమెంటరీ పరీక్షలతో పాటుగా, ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు తాము ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల్లో మార్కులను పెంచుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు.
  • థియరీ పరీక్షలకు మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు మెరుగుపరుచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని బోర్డు స్పష్టం చేసింది.
  • ఫెయిల్ అయిన విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులైనా, వారు ఉత్తీర్ణత సాధించే వరకు పరిమితి లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు.

ఫీజు, దరఖాస్తు తేదీలు:

పరీక్షలు రాయదలచుకున్న విద్యార్థులు రూ.600 ప్రాథమిక ఫీజుతో పాటు, ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ పాత ఐడీ నంబరుతోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇంటర్ మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరిస్తారు.

  • దరఖాస్తు గడువు : ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రీకౌంటింగ్ (RC): మార్కులు సరిగ్గా లెక్కించారో లేదో తెలుసుకోవడానికి దీనిని ఎంచుకోవచ్చు.
  • రీవెరిఫికేషన్ (RV): ఇందులో జవాబు పత్రాల స్కాన్ కాపీని విద్యార్థికి పంపిస్తారు. మొత్తం పేపర్‌ను మరోసారి పరిశీలిస్తారు.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks