...
...
Next Story

SVVU Diploma Admissions 2026: పదో తరగతి అర్హతతో తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా.. నోటిఫికేషన్ విడుదల!

SVVU Diploma Admissions 2026: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం డిప్లోమా కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి పాసై ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

Published on: May 25, 2026 09:37 PM IST
Advertisement

పశువైద్య రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు సువర్ణావకాశం. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం(SVVU), 2026-27 విద్యాసంవత్సరానికి గాను 'డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండ్రీ' (పశుసంవర్ధక డిప్లొమా) కోర్సులో ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ 2 సంవత్సరాల కోర్సు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం డిప్లోమా కోర్సులు
శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం డిప్లోమా కోర్సులు

SVVU పరిధిలోని మొత్తం 22 పాలిటెక్నిక్ కళాశాలల్లో (10 ప్రభుత్వ + 12 ప్రైవేట్/అనుబంధ) ఈ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 990 సీట్లు కేటాయించారు.

అర్హతలు

గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (SSC) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 31-08-2026 నాటికి 15 ఏళ్ల నుండి 22 ఏళ్ల లోపు ఉండాలి.(అనగా అభ్యర్థులు 01-09-2004 నుండి 31-08-2011 మధ్య జన్మించి ఉండాలి).

ఎంపిక విధానం

ఈ కోర్సులో ప్రవేశానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల అగ్రిగేట్ (లేదా ఓవరాల్ GPA), ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, బీసీ అభ్యర్థులకు రూ. 1000గా ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 550గా ఫీజు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తులు 26 మే 2026 నుంచి 15 జూన్ 2026 వరకు చేసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు SVVU అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 26 నుంచి జూన్ 15 లోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే), ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికేట్, ఫోటో, సంతకం సిద్ధంగా ఉంచుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe