...
...
Next Story

Brahmamudi April 15th Episode: బ్రహ్మముడి.. చిన్న మరదలిని చూసి స్వరాజ్ షాక్.. అన్నను ఇరికించిన తమ్ముడు.. దొరికిన ఇందు!

Brahmamudi April 15th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో ఇందుని స్వరాజ్ కిడ్నాప్ చేసి దాచిన చోటుకి నందు చేరుకుంటుంది. చిన్న మరదలిని చూసి అతడు షాక్ తింటాడు. ఆమె వెంటే రాజు తమ్ముడు వెంకీ ఉంటాడు.

Published on: Apr 15, 2026, 06:49:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahmamudi April 15th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురైంది. రూ.కోటి కోసం ఇందుని స్వరాజ్ కిడ్నాప్ చేస్తే.. అతని లొకేషన్ తెలుసుకొని అతని తమ్ముడు వెంకీని వెంటబెట్టుకొని అక్కడికి వస్తుంది నందు. ఆమెను చూసి రాజు, లక్కీ షాక్ తింటారు.

స్వాతిని లాగి పెట్టి కొట్టిన అపర్ణ

Brahmamudi April 15th Episode: బ్రహ్మముడి.. చిన్న మరదలిని చూసి స్వరాజ్ షాక్.. అన్నను ఇరికించిన తమ్ముడు.. దొరికిన ఇందు!
Brahmamudi April 15th Episode: బ్రహ్మముడి.. చిన్న మరదలిని చూసి స్వరాజ్ షాక్.. అన్నను ఇరికించిన తమ్ముడు.. దొరికిన ఇందు!

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 15) ఎపిసోడ్ బంటీకి స్వాతి ఫోన్ చేసే సీన్ తో మొదలవుతుంది. అక్క ఎక్కడ అని అడిగితే.. తాము కిడ్నాప్ చేయలేదని, కిడ్నాప్ చేసిన వాళ్లను అడగమని అనడంతో ఆమె షాక్ తింటుంది. అందరిలాగే ఆ రోజు ఆ పొగకి తాము నిద్రపోయామని, లేచి చూసేసరికి మీ అక్క కనిపించలేదని బంటీ అంటాడు. దీంతో స్వాతి కంగారు పడుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న అపర్ణ.. స్వాతిని లాగి పెట్టి కొడుతుంది.

రాజు ఇంటికి సాహు చేపలు, లెటర్

ఇటు రాజుకి తండ్రి చలపతి ఫోన్ చేస్తాడు. ఆ సాహు గాడు మళ్లీ ఇంటికి చేపలు పార్శిల్ పంపించాడని, ఓ లెటర్ కూడా ఇచ్చాడని చెబుతాడు. దీంతో రాజు కంగారు పడతాడు. ఆ లెటర్ లో ఏముందని అడిగితే.. మన ఫ్యామిలీ కోసం అన్నదానం చేశాడట.. మళ్లీ మీ తమ్ముడికి రోడ్డు పక్కన వెళ్తుంటే యాక్సిడెంట్ కాకుండా ఉండాలని మొక్కాడట అని చలపతి చెబుతాడు. అది విని రాజు మరింత టెన్షన్ పడతాడు. ఇలాంటివి చేయద్దని సాహుకి చెప్పమని రాజుని తిట్టి ఫోన్ పెట్టేస్తాడు.

ఇందుని ఇంప్రెస్ చేయడానికి రాజు తంటాలు

కానీ ఇందు సడెన్ గా సివంగిలా మారిపోతుంది. నువ్వు వెధవ అనుకున్నాను కానీ వెధవన్నర వెధవ్వి అంటూ పక్కనే ఉన్న చీపురు తీసి రాజు, లక్కీలను చితకబాదుతుంది. తాను చెప్పిన స్టోరీ ఇందు నమ్మలేదని రాజుకి అర్థమై బయటకు వెళ్లి డోరు లాక్ చేస్తాడు. తనను వదిలేయమని ఇందు అడిగితే.. నువ్వు బయటకు వెళ్తే పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు.. దొరికిపోతావ్ అని రాజు అంటాడు. అలా అయితే నువ్వే కిడ్నాప్ చేశావని చెబుతానని ఇందు అంటుంది. అందుకే నిన్ను వదలను అని చెప్పి డోరు లాక్ చేసేస్తాడు రాజు.

స్వాతిని నిలదీసిన అపర్ణ.. వినేసిన నందు

ఇటు ఇంట్లో స్వాతిని అపర్ణ నిలదీస్తుంది. ఇంత పని చేసే ముందు తనకు కనీసం ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అడుగుతుంది. చెబుదామంటే అక్కే వద్దన్నదని స్వాతి అంటుంది. ఇందు తనకు తానుగా కిడ్నాప్ చేయించుకోవాలన్న ప్లాన్ వేసిందని స్వాతి చెప్పడం నందు వింటుంది. అపర్ణ, స్వాతి దగ్గరికి వెళ్లి ఇందు అక్కకి ఏమీ కాదని, తాను కచ్చితంగా ఆమెను తీసుకొస్తానని హామీ ఇస్తుంది.

రేఖకు మళ్లీ ఫోన్ చేసిన రాజు

రేఖకు రాజు మళ్లీ ఫోన్ చేస్తాడు. తాను డబ్బు అడగ్గానే ఎప్పుడు, ఎక్కడికి తెచ్చివ్వాలో అడగరా అని రేఖను నిలదీస్తాడు. అలాగే కాసేపు మాట్లాడుతూ ఉండాలని నందు చెబుతుంది. ఇంతలో లొకేషన్ కనిపెట్టేస్తానంటుంది. రేఖకు ఏం మాట్లాడాలో తెలియకపోవడంతో భ్రమరాంబ ఫోన్ తీసుకొని కాస్త టైమ్ కావాలని అడుగుతుంది. ఇంతలో రాజు మాట్లాడుతున్న లొకేషన్ ను నందు ట్రేస్ చేస్తుంది.

అయితే అక్కడికి వెళ్తూ వెళ్తూ రాజు తమ్ముడు వెంకీని నందు వెంట తీసుకెళ్తుంది. వాళ్లిద్దరూ కలిసి రావడం చూసి రాజు, లక్కీ షాక్ తింటారు. స్వరాజ్ కు చిన్న మరదలు అయిన నందు నేరుగా వచ్చి ఇందుని కిడ్నాప్ చేసి దాచిన ఇంటి తలుపునే కొడుతుంది. స్వరాజ్ ఆమెను చూసి కంగు తింటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe