దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఒకపక్క సినిమా విడుదలైతే రికార్డులు బద్దలవ్వడం ఖాయమని అడ్వాన్స్ బుకింగ్స్ (రూ. 50 కోట్లు) చెబుతుంటే.. మరోపక్క మద్రాస్ హైకోర్టులో కేసు తీర్పు రిజర్వ్ అవ్వడంతో జనవరి 9న సినిమా వస్తుందా రాదా అనే టెన్షన్ నెలకొంది.
జన నాయగన్ బుకింగ్స్ సునామీ.. రూ. 50 కోట్లు

జన నాయగన్ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోయినా.. విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అడ్వాన్స్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటుతున్నాయి. అదే స్థాయిలో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి.
అయితే సినిమాకు సెన్సార్ చిక్కులు ఉన్నా, కేవలం పరిమితంగా ఓపెన్ చేసిన బుకింగ్స్ తోనే 'జన నాయగన్' రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్ ద్వారానే సినిమా ఇప్పటికే రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో కేవలం మొదటి రోజు కోసమే రూ. 32 కోట్లు రావడం విశేషం.
ఇక మలేషియాలో బుకింగ్స్ ఓపెన్ అయిన గంటన్నరలోనే 90,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విజయ్ గత చిత్రం 'లియో' (1.08 లక్షల టికెట్లు) రికార్డును ఇది దాటేలా ఉంది. అక్కడ ఈ సినిమాకు '16' రేటింగ్ ఇచ్చారు.
ఇండియా విషయానకి వస్తే.. కర్ణాటక, కేరళ వంటి పరిమిత ప్రాంతాల్లోనే బుకింగ్స్ ఓపెన్ అయినా.. ఇండియాలో 2.93 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. సాక్నిల్క్ (Sacnilk) ప్రకారం.. ఇప్పటివరకు ఇండియాలో రూ. 7.7 కోట్లు వసూలు చేసింది.
హైకోర్టు షాక్.. చెన్నైలో షోలు మాయం
సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికెట్ జాప్యంపై కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌పై బుధవారం (జనవరి 7) విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేయడంతో.. ప్లాన్ ప్రకారం జనవరి 9న సినిమా రిలీజ్ అవ్వడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
{{/usCountry}}సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికెట్ జాప్యంపై కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌పై బుధవారం (జనవరి 7) విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేయడంతో.. ప్లాన్ ప్రకారం జనవరి 9న సినిమా రిలీజ్ అవ్వడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
{{/usCountry}}హైకోర్టు పరిణామాల నేపథ్యంలో చెన్నైలో బుక్‌మైషో (BookMyShow) ప్లాట్‌ఫామ్ సినిమా షోలను తొలగించింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు నటించిన ఈ సినిమాపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రిలీజ్ వాయిదా వేయాల్సి వస్తే మాత్రం మేకర్స్ కు అది పెద్ద దెబ్బే అవుతుంది.