...
...
Next Story

Sree Vishnu: ప్రభుత్వ ఉద్యోగులనే చంపే కిల్లర్- బిగ్ బాస్ అర్జున్ అంబటి పరమపద సోపానం ట్రైలర్ రిలీజ్ చేసిన శ్రీవిష్ణు!

Sree Vishnu Released Paramapada Sopanam Trailer: బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ పరమపద సోపానం. పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వం వహించిన పరమపద సోపానం మూవీ ట్రైలర్‌ను హీరో శ్రీవిష్ణు రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Apr 19, 2026 08:23 AM IST
Advertisement

Sree Vishnu Released Paramapada Sopanam Trailer: వైవిధ్యమైన సినిమాలతో హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బిగ్ బాస్ అర్జున్ అంబటి. ఇటీవలే బిగ్ బాస్ అర్జున్ నెగెటివ్ రోల్‌లో నటించిన పోచమ్మ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు అంబటి అర్జున్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ 'పరమపద సోపానం'.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు

ప్రభుత్వ ఉద్యోగులనే చంపే కిల్లర్- బిగ్ బాస్ అర్జున్ అంబటి పరమపద సోపానం ట్రైలర్ రిలీజ్ చేసిన శ్రీవిష్ణు
ప్రభుత్వ ఉద్యోగులనే చంపే కిల్లర్- బిగ్ బాస్ అర్జున్ అంబటి పరమపద సోపానం ట్రైలర్ రిలీజ్ చేసిన శ్రీవిష్ణు

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. 'గణపర్తి శ్వేత' సమర్పణలో 'స్వయంభూ క్రియేషన్స్' బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా... పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమాలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్ హీరోయిన్‌గా చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక గ్రిప్పింగ్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పరమపద సోపానం సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ట్రైలర్ రిలీజ్ చేసిన శ్రీవిష్ణు

మాస్ మహారాజ్ రవితేజ 'ఈగల్' సినిమాతో తన మ్యూజిక్ పవర్‌ను చూపించిన డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన 'చిన్ని చిన్ని తప్పులేవో', 'భూమ్ భూమ్' వంటి పాటలకు యూట్యూబ్‌లో విశేష స్పందన లభించింది. పరమపద సోపానం టీజర్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ సందర్భంగా పరమపద సోపానం ట్రైలర్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. 'కింగ్ ఆఫ్ కంటెంట్', హీరో శ్రీవిష్ణు పరమపద సోపానం ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.

మంచి థ్రిల్లర్ చూడబోతున్నామనే

"దర్శకుడు నాగ శివ కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు. టాలెంటెడ్ డైరెక్టర్, మంచి హార్డ్ వర్కర్. ఈ సినిమాతో ఆయన కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను. 'పరమపద సోపానం' సినిమాకి పనిచేసిన వారందరికీ నా బెస్ట్ విషెస్" అని చెప్పుకొచ్చారు హీరో శ్రీవిష్ణు.

ప్రభుత్వ ఉద్యోగులనే చంపేసే కిల్లర్

ఇక 'పరమపద సోపానం' ట్రైలర్ విషయానికి వస్తే.. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఓ సోషల్ ఎలిమెంట్‌ను కూడా దర్శకుడు నాగ శివ ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నట్టు స్పష్టమవుతుంది. పరమపద సోపానం సినిమా ప్రభుత్వ ఉద్యోగులనే చంపేసే ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

హీరో అర్జున్ అంబటి కటౌట్‌ని యాక్షన్ ఎపిసోడ్స్‌కి వాడిన తీరు, రొమాంటిక్ సన్నివేశాలు, బీచ్ సీక్వెన్స్‌లు వంటివి చూస్తుంటే తన గురువు రీ జగన్నాథ్ మార్క్ 'మాస్ అండ్ క్లాస్' శైలిని దర్శకుడు నాగ శివ ఒంటబట్టించుకున్నారని స్పష్టమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా, అన్ని రకాల హంగులతో ఏప్రిల్ 24కి థియేటర్లలోకి వచ్చేందుకు పరమపద సోపానం ముస్తాబవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe