కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో 8వ వేతన సంఘం (8th Pay Commission)పై చర్చలు జోరందుకున్నాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు, పదేళ్లకు ఒకసారి జరిగే వేతన సవరణను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని 4 రెట్లు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ కమిషన్‌కు తమ అభిప్రాయాలను, స్పందనలను సమర్పించే చివరి గడువును జూన్ 15 వరకు పొడిగించారు.

ఈ వేతన సంఘం చర్చల్లో అత్యంత కీలకమైన అంశం 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్'. నిత్యావసరాల ధరలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో, ఈ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఉద్యోగుల జీవన ప్రమాణాలు అంతగా మెరుగుపడతాయి. సాధారణంగా ఒక ఉద్యోగి తన ముప్పై ఏళ్ల సర్వీసులో కేవలం మూడు లేదా నాలుగు వేతన సంఘాలను మాత్రమే చూస్తారు. అందువల్ల, ఈ దశాబ్దపు సవరణ తమకు గరిష్ట ప్రయోజనం చేకూర్చాలని లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు కోరుకుంటున్నారు.
3.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?
"ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వేతనాన్ని (Basic Pay) కొత్త వేతనంగా మార్చే గుణకమే (Multiplier) ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. 7వ వేతన సంఘం దీనిని 2.57గా ఖరారు చేయడంతో కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000గా మారింది. ఇప్పుడు దీనిని 3.5కి పెంచితే కనీస వేతనం ఏకంగా రూ. 63,000కు చేరుకుంటుంది. అంటే ప్రస్తుత కనీస వేతనం కంటే 250 శాతం పెరుగుదల కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ ఖజానాపై పెద్ద ప్రభావమే చూపుతుంది. 8వ వేతన సంఘం దాదాపు 50 లక్షల మంది క్రియాశీల ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపుతుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ద్రవ్య లోటు (Fiscal Deficit) లక్ష్యం ఇప్పటికే జీడీపీలో 4.3 శాతంగా ఉంది, ఇందులో నాలుగో వంతు కంటే ఎక్కువ భాగం కేవలం వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 వరకు పెంచడమే గరిష్ట పరిమితి అని ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి 3.5 ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వం వద్ద ఉన్న ఆర్థిక లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది" అని బ్యాంక్‌బజార్ సీఈఓ అధిల్ శెట్టి వివరించారు.
ఈ విశ్లేషణను బట్టి విధాన నిర్ణేతల ముందున్న సవాళ్లు స్పష్టమవుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఎంత పెంచినా అది కేవలం జీతాలనే కాకుండా, ప్రభుత్వ పెన్షన్ బాధ్యతలను కూడా భారీగా పెంచుతుంది. ఆర్థిక క్రమశిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున, ఉద్యోగుల అంచనాలకు, బడ్జెట్ పరిమితులకు మధ్య సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది.
ఉద్యోగ సంఘాల డిమాండ్లు - మార్కెట్ ప్రభావం
{{/usCountry}}ఈ విశ్లేషణను బట్టి విధాన నిర్ణేతల ముందున్న సవాళ్లు స్పష్టమవుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఎంత పెంచినా అది కేవలం జీతాలనే కాకుండా, ప్రభుత్వ పెన్షన్ బాధ్యతలను కూడా భారీగా పెంచుతుంది. ఆర్థిక క్రమశిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున, ఉద్యోగుల అంచనాలకు, బడ్జెట్ పరిమితులకు మధ్య సమతుల్యతను సాధించాల్సి ఉంటుంది.
ఉద్యోగ సంఘాల డిమాండ్లు - మార్కెట్ ప్రభావం
{{/usCountry}}నిపుణులు ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.5 నుంచి 3 మధ్య ఉండవచ్చని అంచనా వేస్తుండగా, ఉద్యోగ సంఘాలు మాత్రం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా 3 నుంచి 4 రెట్ల పెంపును కోరుతున్నాయి. ఒకవేళ 4 రెట్ల పెంపుదల గనుక అమలైతే కనీస ప్రాథమిక వేతనం రూ. 72,000కు చేరుకునే అవకాశం ఉంది.
పెరిగిన జీతాలు మార్కెట్‌లో కొనుగోలు శక్తిని (Consumption) పెంచుతాయని కొందరు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. చేతిలో నగదు లభ్యత పెరగడం వల్ల ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG), గృహ నిర్మాణం, వాహనాలు, ఆర్థిక సేవలు, ప్రయాణ రంగాల్లో డిమాండ్ పెరిగి, మందగించిన దేశీయ మార్కెట్లకు కొత్త ఊపు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
బడ్జెట్ క్రమశిక్షణ - ఉద్యోగుల సంక్షేమం
"8వ వేతన సంఘం కింద 3.5 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే ఉద్యోగుల చేతికి వచ్చే ఆదాయం పెరిగి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. అయితే, ఇదే సమయంలో ప్రభుత్వ జీతాలు, పెన్షన్ల వ్యయం భారీగా పెరిగి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుంది. ఉద్యోగుల సంక్షేమానికి, బడ్జెట్ క్రమశిక్షణకు మధ్య సరైన సమతుల్యతను సాధించడమే ఇక్కడ ప్రధాన సవాలు. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆర్థిక కోణాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది" అని మోహిత్ ఎస్ గోయల్ అండ్ కో అధినేత, సీఏ మోహిత్ గోయల్ పేర్కొన్నారు.
పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు తగిన పరిహారం అందించడం, అదే సమయంలో దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం అనే సందిగ్ధంలో పాలకులు ఉన్నారు. 8వ వేతన సంఘం సంప్రదింపులు కొనసాగుతున్న తరుణంలో, ఆర్థిక వాస్తవాలు, ఉద్యోగుల అంచనాలను బట్టి ఈ 'మ్యాజిక్ నంబర్' ఖరారు కానుంది.