బుధవారం ఉదయం బులియన్ మార్కెట్ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తుండటంతో దేశీయ కమోడిటీ మార్కెట్ (MCX)లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుండటంతో, ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్ల వైపు నడిపిస్తున్నాయి.
రికార్డుల వేటలో పసిడి, వెండి

జనవరి 14న ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు తీశాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.50 శాతం లాభపడి 10 గ్రాములకు రూ. 1,42,938 వద్ద ట్రేడవుతోంది. అటు వెండి ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 2.60 శాతం జంప్ చేసి కిలో రూ. 2,82,351 మార్కును తాకింది. ఒక్కరోజే వెండి ధరలో ఇంతటి భారీ పెరుగుదల కనిపించడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ద్రవ్యోల్బణం తగ్గుదల.. వడ్డీ రేట్ల కోతపై ఆశలు
అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం మార్కెట్‌కు ప్రధాన బూస్ట్‌గా నిలిచింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. డిసెంబర్ నెలలో అమెరికా కోర్ వినియోగదారుల ధరల సూచీ (CPI) 2.6 శాతంగా నమోదైంది. వాస్తవానికి విశ్లేషకులు ఇది 2.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈ గణాంకాలు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను పెంచాయి. అయితే, జనవరిలోనే రేట్ల కోత ఉంటుందని మార్కెట్ ఆశించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"డిసెంబర్ ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, జనవరిలో ఫెడ్ యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉంది. మార్కెట్ ప్రస్తుతం ఫెడ్ స్వతంత్రత మరియు ఉపాధి రంగంలోని మార్పులపై దృష్టి పెట్టింది" అని ఎమ్‌కే గ్లోబల్ లీడ్ ఎకనమిస్ట్ మాధవీ అరోరా వివరించారు.
ప్రపంచ రాజకీయాల్లో సెగలు.. పసిడికి రెక్కలు
ఆర్థిక అంశాలతో పాటు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా బంగారానికి రక్షణ కవచంలా మారాయి. వెనిజులా, ఇరాన్, గ్రీన్లాండ్ అంశాల్లో అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరితో ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్లో గత కొన్నేళ్లలో లేని విధంగా అతిపెద్ద నిరసనలు వ్యక్తమవుతున్నాయి. "సహాయం అందుతోంది.. నిరసనలు కొనసాగించండి" అంటూ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు, ఇరాన్ అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యం సరికాదంటూ రష్యా తీవ్రంగా విమర్శించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ఆశలు కూడా సన్నగిల్లడంతో, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లుతున్నారు.
{{/usCountry}}ఆర్థిక అంశాలతో పాటు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా బంగారానికి రక్షణ కవచంలా మారాయి. వెనిజులా, ఇరాన్, గ్రీన్లాండ్ అంశాల్లో అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరితో ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్లో గత కొన్నేళ్లలో లేని విధంగా అతిపెద్ద నిరసనలు వ్యక్తమవుతున్నాయి. "సహాయం అందుతోంది.. నిరసనలు కొనసాగించండి" అంటూ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు, ఇరాన్ అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యం సరికాదంటూ రష్యా తీవ్రంగా విమర్శించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ఆశలు కూడా సన్నగిల్లడంతో, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లుతున్నారు.
{{/usCountry}}(సూచన: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్ ఒడిదుడుకులు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)