కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా తిరుగుతున్నాయి. ఇప్పుడు, వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అనేక ఫీచర్లతో, అందరని ఆశ్చర్యపరిచే విధంగా వీటిని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఇంటీరియర్‌కి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఇంటీరియర్..

వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులో ఉంటాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దిల్లీ రైల్వే స్టేషన్‌లో మీడియా ప్రతినిధులతో కలిసి ఆయన రైలు కోచ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైలులోని అత్యాధునిక సౌకర్యాలను ఆయన వివరించారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతి చిన్న విషయంలోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విశాలమైన ట్రే హోల్డర్లు, అడ్జస్ట్ చేసుకునే వీలున్న విండో షేడ్స్, రీడింగ్ లైట్లు, హ్యాంగర్లు, మ్యాగజైన్ హోల్డర్లు వంటి వసతులను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
వాష్ బేసిన్ల నుంచి నీరు బయటకు చిందకుండా మెరుగైన డిజైన్‌ను ఈ ట్రైన్లో రూపొందించారు. అదే సమయంలో, చూపులేని ప్రయాణికుల కోసం సీటు నంబర్లను 'బ్రెయిలీ' లిపిలో కూడా పొందుపరిచారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:
వందే భారత్ స్లీపర్ ట్రైన్- అత్యాధునిక సాంకేతికత, భద్రత..
ఈ రైలు కేవలం వేగమే కాదు, భద్రత, సౌకర్యాలకు కూడా చిరునామాగా నిలవనుంది. దీనిలోని ప్రధాన ఫీచర్లు..
{{/usCountry}}ఈ రైలు కేవలం వేగమే కాదు, భద్రత, సౌకర్యాలకు కూడా చిరునామాగా నిలవనుంది. దీనిలోని ప్రధాన ఫీచర్లు..
{{/usCountry}}మెరుగైన బెర్తులు: సౌకర్యవంతమైన కుషనింగ్‌తో కూడిన ఎర్గోనామిక్ బెర్తులు.
ఆటోమేటిక్ డోర్లు: కోచ్‌ల మధ్య సులభంగా వెళ్లడానికి ఆటోమేటిక్ డోర్లతో కూడిన వెస్టిబ్యూల్స్.
కవచ్: స్వదేశీ సాంకేతికతతో తయారైన రైలు రక్షణ వ్యవస్థ.
ప్రయాణ సౌకర్యం: మెరుగైన సస్పెన్షన్, శబ్దం తక్కువగా వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు.
పరిశుభ్రత: 99.9% క్రిములను చంపేసే 'డిసిన్ఫెక్టెంట్ టెక్నాలజీ'ని ఇందులో వినియోగించారు.
ఇటీవల రైల్వే సేఫ్టీ కమిషనర్ పర్యవేక్షణలో ఈ రైలు ఫైనల్ హై-స్పీడ్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కోటా - నాగ్డా సెక్షన్ మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తన సత్తా చాటింది.
మధ్యతరగతికి అందుబాటులో ధరలు..
ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ విమానాలకు గట్టి పోటీనిచ్చే విధంగా ఉన్నాయి! విమాన ప్రయాణంతో పోలిస్తే ఈ వీటి ధరలు చాలా తక్కువని మంత్రి తెలిపారు. "మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకునే ఛార్జీలను నిర్ణయించాము," అని ఆయన పేర్కొన్నారు.
అంచనా ధరల పట్టిక (ఆహారంతో కలిపి):
3 ఏసీ- రూ. 2,300
2 ఏసీ - రూ. 3,000
1 ఏసీ- రూ. 3,600 |
కోచ్‌ల వివరాలు:
మొత్తం 16 కోచ్‌లలో 823 బెర్తులు అందుబాటులో ఉంటాయి.
3 ఏసీ: 11 కోచ్‌లు (611 బెర్తులు)
2 ఏసీ: 4 కోచ్‌లు (188 బెర్తులు)
1 ఏసీ: 1 కోచ్ (24 బెర్తులు)
వందే భారత్ స్లీపర్ ట్రైన్ త్వరలోనే ప్రారంభం..
కోల్‌కతా - గువాహటి మార్గంలో నడిచే ఈ 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "చాలా త్వరలో" ప్రారంభించనున్నారు అని అశ్విణి వైష్ణవ్ తెలిపారు.
ప్రారంభోత్సవ వేడుక కోసం ఇప్పటికే ఒక రైలును గువహాటికి, మరొకటి కోల్‌కతాకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 12 వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.