...
...
Next Story

JEE Mains 2026 Session 2 : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 అడ్మిట్​ కార్డ్​లు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్-2 పరీక్షల అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు జరగనున్నాయి.

Published on: Mar 30, 2026, 05:31:47 IST
Advertisement

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'జేఈఈ మెయిన్స్​ 2026' రెండో సెషన్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను పొందవచ్చు.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2..
జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2..

స్టెప్​ 1- మొదట జేఈఈ మెయిన్స్​ అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in) సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో ఉన్న 'Session 2 Admit Card' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- అభ్యర్థి లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్​ 4- అక్కడ మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేయండి.

స్టెప్​ 5- సబ్మిట్ బటన్ నొక్కగానే మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్​ 6- దానిని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.

స్టెప్​ 7- పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డ్ వంటివి) తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని తమ పేరు, ఫోటో, పరీక్షా కేంద్రం చిరునామా, సమయం వంటి వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2 పరీక్షల షెడ్యూల్ ఇలా..

ఈ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఇందులో పేపర్-1 (BE/BTech), పేపర్-2A, 2B (BArch, BPlanning) విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల నగరాల వివరాలను మార్చి 23నే ఎన్టీఏ వెల్లడించిన సంగతి తెలిసిందే.

జేఈఈ మెయిన్స్​ 2026 సెషన్​ 2 ఫలితాలు ఎప్పుడంటే..

ప్రఖ్యాత ఇంజినీరింగ్​ కాలేజీల్లో చదువు కోసం ప్రతియేటా లక్షలాది మంది విద్యార్థులు ఈ జేఈఈ మెయిన్స్​ పరీక్షలను రాస్తుంటారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks