భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది జపాన్ దిగ్గజం నిస్సాన్. ఇందులో భాగంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, రెనాల్ట్ ట్రైబర్ ఆధారిత, సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీ ‘గ్రావిటే’ని పరిచయం చేయబోతోంది. 2026 మార్చి నాటికి ఈ కారు షోరూమ్‌లలో సందడి చేసే అవకాశం ఉంది. మరి ఇది కేవలం రెనాల్ట్ ట్రైబర్‌కి రీబ్యాడ్జ్ వర్షెన్‌గా మిగిలిపోతుందా? లేదా ఇందులో కొత్తగా ఏమైనా ఉంటాయా?
నిస్సాన్ గ్రావిటే- జనవరి 21న గ్రాండ్ ఎంట్రీ!

వచ్చే ఏడాది జనవరి 21న 'గ్రావిటే' ఎంపీవీని ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేయనుంది నిస్సాన్. ఈ ఎంపీవీ తర్వాత 2026 మధ్యలో 'టెక్టాన్' ఎస్‌యూవీని, ఆపై 2027లో మరో భారీ 7-సీటర్ ఎస్‌యూవీని తీసుకురావాలని కంపెనీ పక్కా ప్రణాళికతో ఉంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదల చేసిన గ్రావిటే టీజర్లు.. ఈ ఎంపీవీపై ఆసక్తిని పెంచుతున్నాయి.
డిజైన్‌లో కొత్తదనం.. రెనాల్ట్ ట్రైబర్‌కు వారసుడిగా!
కొత్త ఎంపీవీ ముందు, వెనుక డిజైన్లను చూస్తే ఇది రెనాల్ట్ ట్రైబర్ రీబ్యాడ్జ్ వర్షెన్ అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ స్టైలింగ్‌ని మాత్రం కాస్త మార్చింది. ముఖ్యంగా ముందు భాగంలో పెద్ద గ్రిల్, కొత్త డిజైన్ కలిగిన ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. బంపర్ వద్ద 'సీ' ఆకారపు ట్రిమ్స్ కారు వెడల్పుగా కనిపించేలా చేస్తున్నాయి. వెనుక వైపు 'గ్రావిటే' అనే పేరు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు.
- టెక్టాన్ నుంచి 7 సీటర్ ఎస్యూవీ వరకు- నిస్సాన్ నుంచి రాబోతున్న క్రేజీ కార్లుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
లోపల అంతా విలాసం.. ఫీచర్లు ఇవే!
ఇంటీరియర్ విషయానికి వస్తే, నిస్సాన్ ఈ కారులో 'అల్ట్రా-మాడ్యులర్' సీటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే అవసరాన్ని బట్టి సీట్లను మార్చుకోవచ్చు.
{{/usCountry}}ఇంటీరియర్ విషయానికి వస్తే, నిస్సాన్ ఈ కారులో 'అల్ట్రా-మాడ్యులర్' సీటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంటే అవసరాన్ని బట్టి సీట్లను మార్చుకోవచ్చు.
{{/usCountry}}నిస్సాన్ గ్రావిటేలో కొన్ని ప్రధాన ఫీచర్లు ఇలా ఉన్నాయి:
7-ఇంచ్ టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 8-ఇంచ్ టచ్‌స్క్రీన్.
వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ స్టోరేజ్ బాక్స్.
రెండో వరుసలో స్లైడింగ్, రీక్లైన్ చేసుకునే సౌకర్యం ఉన్న సీట్లు.
చిన్న కారే అయినప్పటికీ, ఏడుగురు ప్రయాణించడానికి వీలుగా దీనిని తీర్చిదిద్దారు! అయితే, మూడొవ వరుసలో స్పేస్ పరిమితంగానే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉంటుంది?
నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ ఇంజిన్ వివరాలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఇందులో 1.0 లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 72 హెచ్‌పీ పవర్‌ను, 96 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఇది లభించనుంది. భారతీయ రోడ్లకు అనుగుణంగా నిస్సాన్ ఈ ఇంజిన్‌లో కొన్ని చిన్నపాటి మార్పులు చేయవచ్చని సమాచారం.
మొత్తానికి, బడ్జెట్ ధరలో ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి నిస్సాన్ గ్రావిటీ ఒక మంచి ఎంపిక కానుంది.