...
...
Next Story

సిస్టమ్ ఫెయిల్యూర్‌ హిడ్మాలు, ఐబొమ్మ రవిలను సృష్టిస్తాయి : సీపీఐ నారాయణ

కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు హిడ్మా, ఐబొమ్మ రవి. అయితే వారిపై సీపీఐ నారాయణ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Published on: Nov 30, 2025 04:03 PM IST
Advertisement

ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి కొన్ని రోజులుగా చర్చ ఎక్కువగా జరుగుతుంది. తాజాగా వారిపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఒక హిడ్మాని చంపడం వల్ల వెయ్యి మంది హిడ్మాలు పుట్టే అవకాశం ఉందని, ఇది లోతుగా పాతుకుపోయిన వ్యవస్థాగత వైఫల్యాలను సూచిస్తుందని అన్నారు.

సీపీఐ నారాయణ
సీపీఐ నారాయణ

ఇమంది రవి వంటి సమాచారం ఉన్న వ్యక్తి కూడా వ్యవస్థలోని లోపాల కారణంగా తప్పుడు మార్గంలోకి మళ్లారని సీపీఐ నారాయణ అన్నారు. ఐబొమ్మలో తాను కూడా ఫ్రీగా సినిమాలు చూశానని నారాయణ ఒప్పుకున్నారు. ఆరేడు వందల రూపాయలు టికెట్ ధరలు పెడితే సినిమాలు ఎలా చూడాలని ప్రశ్నించారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారు అని వ్యాఖ్యానించారు.

'ఒక ఐబొమ్మ రవిని చంపితేనో, జైలులో వేస్తేనో మరో వంద మంది వస్తారు. ఐబొమ్మ రవిని ఉరి తీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం. కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం అడుక్కుంటారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సాయం చేస్తుందా? కోట్లాది రుపాయలు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బ కొట్టారు.' అని సీపీఐ నారాయణ అన్నారు.

వ్యవస్థలోని లొసుగులను సరిచేయకపోతే, రవి లాంటి వ్యక్తులు వస్తూనే ఉంటారని సీపీఐ నారాయణ చెప్పారు. ఒక వ్యక్తి మంచి కోసం పనిచేస్తుంటే, మరొకరు హాని కలిగించవచ్చని, వ్యక్తులను శిక్షించడం వల్ల మాత్రమే సమస్య పరిష్కారం కాదని అన్నారు. ఈ వ్యవస్థే ఐబొమ్మ రవి లాంటి వ్యక్తులను సృష్టించిందని, వ్యవస్థాగత సమస్యలను సరిదిద్దకపోతే అలాంటి వ్యక్తులు మరింత మంది వస్తారని పేర్కొన్నారు

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe