Trigun About PM Modi At Mr Work From Home Trailer Launch: హీరో త్రిగుణ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను అరవింద్ మండెం నిర్మించారు.
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ రిలీజ్

సీహెచ్‌వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందింన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రాన్ని శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సందర్భంగా మేకర్స్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. ట్రైలర్ చెప్పినట్టుగా మార్నింగ్ షో విషయం ఏంటో తెలియదు గానీ, టాక్ బయటకు వస్తే సినిమా గురించి మీకే తెలుస్తుంది" అని అన్నాడు.
చాలా మంచి విజువల్స్
"చాలా మంచి టీమ్‌తో కలిసి నిజాయితీగా చేసిన సినిమా ఇది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. అనీష్ కురువిల్లా గారు, సుదర్శన్ గారు, వైవా హర్ష ఇలా చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాకి పనిచేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. మా కెమెరామెన్ రవి గారు సినిమాను చాలా బ్యూటిఫుల్‌గా తీశారు. చాలా మంచి విజువల్స్ ఉంటాయి" అని హీరో త్రిగుణ్ తెలిపాడు.
మంచి కలెక్షన్స్ రావాలని
"అరుణ్ ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాను విడుదల చేస్తున్న బుచ్చి గారికి, రాందాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను" అని త్రిగుణ్ కోరాడు.
ఐటీ జాబ్ వదిలేసిన కుర్రాడు
{{/usCountry}}"అరుణ్ ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమాను విడుదల చేస్తున్న బుచ్చి గారికి, రాందాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను" అని త్రిగుణ్ కోరాడు.
ఐటీ జాబ్ వదిలేసిన కుర్రాడు
{{/usCountry}}"మొన్ననే ప్రధాని మోదీ గారు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను" అని హీరో త్రిగుణ్ పేర్కొన్నాడు.
పాయల్ రాధాకృష్ణ కామెంట్స్
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.