Genelia Son Rahyl Deshmukh Debut Raja Shivaji Trailer: టాలీవుడ్‌లో హాసినీగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ జెనీలియా. ఇటీవలే తెలుగులో జూనియర్ సినిమాలో ఓ కీలక పాత్రతో అలరించిన జెనీలియా ఇప్పుడు తన కొడుకును సినిమాల్లోకి దింపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో జెనీలియాతోపాటు ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్, కొడుకు మొత్త ఫ్యామిలీ అంతా కలిసి నటించడం విశేషం.
రితేష్ దేశ్‌ముఖ్ కలల ప్రాజెక్ట్

ఆ సినిమానే రాజా శివాజీ. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తన కలల ప్రాజెక్ట్ చిత్రమే ఈ 'రాజా శివాజీ'. ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం కూడా వహించడం మరో విశేషం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా రాజా శివాజీ ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగింది.
తండ్రి వారసుడిగా రాహిల్ ఎంట్రీ
ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద ఆకర్షణ రితేష్, జెనీలియా దంపతుల చిన్న కుమారుడు రాహిల్ దేశ్‌ముఖ్. 10 ఏళ్ల రాహిల్ ఈ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. రాజా శివాజీ ట్రైలర్ ఆరంభంలోనే 'స్వరాజ్యం' గురించి మాట్లాడే బాల శివాజీ పాత్రలో రాహిల్ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
చిన్ననాటి శివాజీ పరాక్రమాన్ని, ఆలోచనలను ప్రతిబింబించే సన్నివేశాల్లో రాహిల్ నటన ఆకట్టుకునేలా ఉంది. సాధారణంగా స్టార్ కిడ్స్ గ్లామరస్ రోల్స్‌తో ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, రాహిల్ ఇలాంటి చారిత్రాత్మక పాత్రను ఎంచుకోవడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్వేగానికి లోనైన రితేష్, జెనీలియా
ఇక రాజా శివాజీ ట్రైలర్ లాంచ్ వేడుకలో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సినిమా కోసం తనకు అండగా నిలిచిన మిత్రులు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
{{/usCountry}}ఇక రాజా శివాజీ ట్రైలర్ లాంచ్ వేడుకలో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సినిమా కోసం తనకు అండగా నిలిచిన మిత్రులు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
{{/usCountry}}"అభిషేక్ నాకు సోదరుడిలా నిలబడ్డారు. ఈ ప్రయాణంలో మా టీమ్ పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది" అంటూ రితేష్ కన్నీరు పెట్టుకున్నారు. నిర్మాతగా వ్యవహరించిన జెనీలియా కూడా ఈ వేదికపై ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. శివాజీ భార్య సాయిబాయి పాత్రలో జెనీలియా నటిస్తుండగా, మొఘలులతో శివాజీ సాగించిన వీరోచిత పోరాటాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.
పిల్లల భవిష్యత్తుపై రితేష్ క్లారిటీ
తన పిల్లలు రాహిల్, రియాన్ భవిష్యత్తు గురించి రితేష్ గతంలోనే ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "పిల్లలు ఏమవ్వాలి అనేది తల్లిదండ్రులు నిర్ణయించకూడదు. వారు ఏ వృత్తిని ఎంచుకోవాలనేది వారి ఇష్టానికే వదిలేయాలి. కేవలం ప్రోత్సహించడం మాత్రమే మన బాధ్యత" అని రితేష్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.
తండ్రి మాటలనే స్ఫూర్తిగా
తండ్రి మాటలనే స్ఫూర్తిగా తీసుకున్న రాహిల్ దేశ్‌ముఖ్ ఇప్పుడు నటన వైపు అడుగులు వేస్తున్నారు. బయట మీడియా ముందు ఎంతో వినయంగా నమస్కరిస్తూ కనిపించే రాహిల్ తెరపై బాల యోధుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ తారాగణం.. మే 1న విడుదల
కాగా రాజా శివాజీ చిత్రంలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ వంటి అగ్ర నటులతో పాటు మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే వంటి భారీ తారాగణం నటిస్తోంది. జ్యోతి దేశ్ పాండే, జెనీలియా దేశ్‌ముఖ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరాఠా వీరుడి పోరాట పటిమను నేటి తరానికి చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.