RGV: సెన్సార్ బోర్డును పూర్తిగా రద్దు చేయాలంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్మార్ట్‌ఫోన్లు, గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విరివిగా వాడుతున్న ఈ డిజిటల్ యుగంలో ప్రేక్షకులను పసిపిల్లల్లా భావించి సీన్లు కట్ చేయడం పెద్ద జోక్ అంటూ తన ఎక్స్ అకౌంట్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్.. అసలు కారణాలు ఇవే

ఆర్జీవీ కెరీర్ మొదటి నుంచి సెన్సార్ బోర్డుతో వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. 'శివ', 'సత్య' కాలం నాటి రస్టిక్ వయొలెన్స్ నుంచి రీసెంట్ గా వచ్చిన పొలిటికల్ డ్రామాల వరకు ఆయన ప్రతి సినిమా సెన్సార్ కట్స్ ఎదుర్కొంది. అందుకే ఆయన ఈసారి ఏకంగా సెన్సార్ వ్యవస్థ ఉనికినే ప్రశ్నిస్తూ గట్టిగా మాట్లాడారు.
దేశ భవిష్యత్తును మార్చే లీడర్లను ఎన్నుకోవడానికి 18 ఏళ్ల వయసున్న యువతకు ఓటు హక్కు ఇస్తున్నప్పుడు, వాళ్లు ఏ సినిమా చూడాలో డిసైడ్ చేసే హక్కు ఎందుకు లేదని ఆర్జీవీ ప్రశ్నించారు. ఒక అడల్ట్ వ్యాపారాలు చేయగలడు, కుటుంబాన్ని నడపగలడు కానీ థియేటర్లలో ఏ సీన్ చూడాలో నిర్ణయించుకోలేడా అని ఎద్దేవా చేశారు. ఇది సమాజానికి రక్షణ కల్పించడం కాదు, ప్రజల తెలివితేటలను అవమానించడమేనని మండిపడ్డారు.
ఏది చూడాలో ఏది చూడకూడదో సెన్సార్ బోర్డులోని ఓ సభ్యుడు చెప్పాలా.. అయినా ఆ బోర్డులోని వాళ్లకు ఉన్న అర్హత ఏంటి అని కూడా ఆర్జీవీ ప్రశ్నించాడు.
టెక్నాలజీ యుగంలో కట్స్ విధించడం హాస్యాస్పదం
ప్రస్తుతం ఇంటర్నెట్ లో దారుణమైన క్రైమ్ న్యూస్, వైల్డ్ కంటెంట్ అందరికీ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు కేవలం సినిమాలపైనే ఎందుకు నిషేధాలు విధిస్తున్నారని ఆర్జీవీ నిలదీశారు. థియేటర్లలో సీన్లు కట్ చేయడం వల్ల లాభం లేదని, ఎలాగూ అన్‌కట్ వెర్షన్స్ కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్, టొరెంట్స్ లోకి వచ్చేస్తాయని గుర్తుచేశారు.
{{/usCountry}}ప్రస్తుతం ఇంటర్నెట్ లో దారుణమైన క్రైమ్ న్యూస్, వైల్డ్ కంటెంట్ అందరికీ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు కేవలం సినిమాలపైనే ఎందుకు నిషేధాలు విధిస్తున్నారని ఆర్జీవీ నిలదీశారు. థియేటర్లలో సీన్లు కట్ చేయడం వల్ల లాభం లేదని, ఎలాగూ అన్‌కట్ వెర్షన్స్ కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్, టొరెంట్స్ లోకి వచ్చేస్తాయని గుర్తుచేశారు.
{{/usCountry}}దీనికి ఉదాహరణగా 'అబ్సెషన్' (Obsession) సినిమాలో సెన్సార్ కట్ చేసిన హెడ్ బ్యాంగింగ్ సీన్‌ను ప్రస్తావించారు. థియేటర్లలో చూసిన వాళ్లకంటే ఆ సీన్‌ను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో 10 రెట్లు ఎక్కువ మంది చూశారని వెల్లడించారు. సెన్సార్ వల్ల కంటెంట్ ఆగిపోదు, పైగా దానికి డిమాండ్ ఇంకా పెరుగుతుందని చెప్పారు.
ఇండస్ట్రీ అంతా ఒక్కటవ్వాలి
సినిమా అనేది మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని, దాన్ని చూసి నచ్చకపోతే తిరస్కరించే హక్కు ఆడియన్స్‌కు ఉందన్నారు. అంతే కానీ క్రియేటివిటీ తెలియని కొందరు అధికారుల ముందు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మోకాళ్లపై వంగి కాంప్రమైజ్ అవ్వొద్దని పిలుపునిచ్చారు. ఇలా ఇండస్ట్రీ లొంగిపోవడం వల్లే వాళ్లు మరింత రెచ్చిపోతున్నారని విమర్శించారు.
సెన్సార్ బోర్డును పూర్తిగా రద్దు చేసి, కేవలం సినిమా కంటెంట్ ఏంటో క్లియర్ రేటింగ్స్ ఇస్తే చాలని, చూడాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టానికే వదిలేయాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. ఇండస్ట్రీ అంతా కలిసి దీనిపై కోర్టుకు వెళ్లాలని, పబ్లిక్ లో పెద్ద ఎత్తున చర్చ జరపాలని కోరారు. #BanTheCensor హాష్ ట్యాగ్ తో ఆయన చేసిన ఈ కామెంట్స్ పై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.