...
...
Next Story

తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ : ప్రయాణికులకు శుభవార్త... అదనంగా మరో 4 కోచ్ లు….!

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిటే వందే భారత్ రైలుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇకపై ఈ మార్గంలో నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 20 బోగీలతో పరుగులు పెట్టనుంది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

Published on: Nov 26, 2025 10:46 AM IST
Advertisement

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 20 బోగీలతో పరుగులు పెట్టనుంది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే (నవంబర్ 27, 2025) అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

4 కోచ్ లు పెంపు….

వందే భారత్ ట్రైన్
వందే భారత్ ట్రైన్

తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16 బోగీలతో నడిచేది. ప్రయాణికుల విజ్ఞప్తుల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో మరో 4 ఏసీ చైర్‌కార్లను శాశ్వత ప్రాతిపదికన జోడించనున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ మార్గంలో వందే భారత్‌కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి మార్పులేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ద్వారా మొత్తం 660 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8గంటల 30నిముషాల్లోనే చేరుకుంటుంది. ఈ రూట్ లో నాలుగు స్టేషన్లు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే స్టాప్స్ ఉండనున్నాయి. ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో…. అదనంగా 4 కోచ్ లను జోడించాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తున్నట్టుగా ఇటీవలనే ఆదేశాలు జారీ అయ్యాయి. 12 జనవరి 2026 నుంచి వందే భారత్ సర్వీసులు నరసాపురం వరకు వెళ్తాయని సదరన్ రైల్వే ప్రకటించింది. దీనితో వందే భారత్ రైలు ద్వారా విజయవాడ చేరుకుని.. తర్వాత నరసాపురం వైపు జర్నీ చేసేవారికి ఉపశమనం కలగనుంది. నేరుగా నరసాపురం వరకూ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

నర్సాపురం నుంచి చెన్నై సెంట్రల్ వచ్చే ట్రైన్ నెంబర్ 20678 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.50కి బయలుదేరుతుంది. 3:20 గంటలకు భీమవరం, మధ్యాహ్నం 4:10కి గుడివాడ, 4:50కి విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుంచి 4.55 గంటలకు బయలుదేరుతుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్లి రాత్రి 11:45 గంటలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు వస్తుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe