...
...
Next Story

MS Dhoni CSK: ఆటగాళ్ల కోసమే ధోనీ మ్యాచ్‌లకు రావట్లేదు- అసలు కారణం చెప్పిన కోచ్ మైక్ హస్సీ- తలా రీ ఎంట్రీపై ఏమన్నారంటే?

CSK Coach Mike Hussey About MS Dhoni Re Entry On Next Match: మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి రీ ఎంట్రీ ఇప్పుడిస్తారన్న దానిపై సీఎస్కే కోచ్ మైక్ హస్సీ క్లారిటీ ఇచ్చారు. అలాగే, సీఎస్కే ఆటగాళ్ల కోసమే మ్యాచ్‌లకు ఎంఎస్ ధోనీ రావట్లేదని అసలు కారణాన్ని బయటపెట్టారు మైక్ హస్సీ. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: May 01, 2026 10:00 PM IST
Advertisement

CSK Coach Mike Hussey On MS Dhoni Re Entry On Next Match: ఐపీఎల్ 2026 సీజన్ మొదలై నెల రోజులు గడుస్తున్నా.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల కళ్లు మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ కోసమే వెతుకుతున్నాయి. మైదానంలో ధోనీ మెరుపులు ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు తాజాగా సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చారు.

స్టేడియంకు రాకపోవడానికి కారణం అదే!

Chennai: Chennai Super Kings' MS Dhoni during a training session. (PTI)
Chennai: Chennai Super Kings' MS Dhoni during a training session. (PTI)

సాధారణంగా జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు మ్యాచ్ ఆడకపోయినా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి సహచర ఆటగాళ్లను ఉత్సాహపరచడం మనం చూస్తుంటాం. కానీ 44 ఏళ్ల ధోనీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటున్న తలా.. మ్యాచ్ జరిగే రోజు మాత్రం స్టేడియం దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. దీనిపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు మ్యాచ్‌లకు ధోనీ రాకపోవడానికి గల అసలు కారణాన్ని మైక్ హస్సీ చెప్పారు. "ధోనీ ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన స్టేడియంకు వస్తే కెమెరా కళ్లన్నీ ఆయనపైనే ఉంటాయి, క్రౌడ్ మొత్తం ఆయన కోసమే అరుస్తుంది. దీనివల్ల మైదానంలో ఆడుతున్న ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. జట్టు దృష్టి మళ్లకూడదనే ఉద్దేశంతోనే ధోనీ మ్యాచ్ రోజున స్టేడియంకు రాకూడదని నిర్ణయించుకున్నారు" అని కోచ్ మైక్ హస్సీ వివరించారు.

ఇంటి నుంచే నిశిత పరిశీలన

ఎంఎస్ మహేంద్ర సింగ్ ధోనీ భౌతికంగా స్టేడియంలో లేకపోయినా, ప్రతి మ్యాచ్‌ను ఇంటి నుంచే అత్యంత నిశితంగా గమనిస్తున్నారని హస్సీ పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ ఉంటే ఆ ధైర్యమే వేరని, ఆయన ఇచ్చే సలహాలు కుర్రాళ్లకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని హస్సీ గుర్తు చేసుకున్నారు.

సీజన్ ఆరంభంలో పిక్క కండరాల గాయం (Calf Strain) కారణంగా ధోనీ మొదటి రెండు వారాలు దూరమవుతారని భావించారు. అయితే ఆ నిరీక్షణ కాస్తా నెల రోజులకు చేరింది. మరి ధోనీ మళ్లీ బ్యాట్ పట్టి బరిలోకి దిగేది ఎప్పుడు? అనే ప్రశ్నకు హస్సీ సానుకూలంగా స్పందించారు.

"ధోనీ కోలుకుంటున్న తీరు చాలా బాగుంది. ముఖ్యంగా రన్నింగ్ స్పీడ్‌ను పెంచడంపై దృష్టి పెట్టారు. వికెట్ల మధ్య పరిగెత్తేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనేది మా ఉద్దేశం. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ విషయంలో ఆయన మునుపటిలాగే సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ధోనీ మైదానంలోకి వస్తారని మేమంతా నమ్ముతున్నాం. బహుశా వచ్చే మ్యాచ్ లేదంటే ఆ తర్వాత మ్యాచ్‌లో తలాను చూడొచ్చు" అని హస్సీ ధీమా వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe