...
...
Next Story

JEE Advanced 2026 : నేడే జేఈఈ అడ్వాన్స్​డ్​- ఈ గైడ్​లైన్స్​ పాటించాలి, ఇవి కచ్చితంగా తీసుకెళ్లాలి..

JEE Advanced 2026 news : ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష నేడు (మే 17) జరగనుంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రిపోర్టింగ్ టైమ్, డ్రెస్ కోడ్, తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ల విషయంలో పాటించాల్సిన కీలక నిబంధనలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 17, 2026 05:26 AM IST
Advertisement

JEE Advanced 2026 updates : దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష నేడు (మే 17, ఆదివారం) జరగనుంది. ఈ పరీక్షను ఐఐటీ రూర్కీ రెండు షిఫ్టుల్లో (పేపర్ 1- ఉదయం 9-12, పేపర్ 2- మధ్యాహ్నం 2:30- 5:30) కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తోంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అనర్హతకు గురికాకుండా ఉండేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026 గైడ్​లైన్స్..
జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026 గైడ్​లైన్స్..

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రిపోర్టింగ్ టైమ్, డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువుల వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026- రిపోర్టింగ్ టైమ్.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026 పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా సాగడం కోసం అభ్యర్థులు నిర్దేశిత సమయానికంటే ముందే చేరుకోవాలి.

  • ఉదయం 7:00 గంటల నుంచే పరీక్షా కేంద్రాల గేట్లు తెరుచుకుంటాయి.
  • అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 1 గంట ముందే సెంటర్‌కు చేరుకోవడం ఉత్తమం.
  • ఉదయం 9:00 గంటల తర్వాత పేపర్ 1 పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత పేపర్ 2 పరీక్షకు ఎంట్రీ ఉండదు.
  • పరీక్ష పూర్తిగా ముగిసే వరకు విద్యార్థులను హాల్ వదిలి వెళ్లడానికి అనుమతించరు.
  • కఠినమైన సెక్యూరిటీ చెక్స్ ఉంటుంది కాబట్టి, ఆలస్యంగా వస్తే లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026- ఈ డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి..

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కింది డాక్యుమెంట్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి:

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్ ప్రింటౌట్.

అంగీకరించే ఐడీ ప్రూఫ్‌లు: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, లేదా స్కూల్/కాలేజ్ ఐడీ కార్డులలో ఏదైనా ఒకటి. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకపోతే పరీక్షకు అనుమతించరు.

డ్రెస్ కోడ్ నిబంధనలు :

సెక్యూరిటీ తనిఖీలు వేగంగా పూర్తి కావడానికి అభ్యర్థులు మెటాలిక్ (లోహపు) వస్తువులు లేని సాధారణ దుస్తులు ధరించాలి.

ధరించకూడనివి: ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, గొలుసులు, హారాలు, చెవి రింగులు, ముక్కు పుడకలు, బ్యాడ్జీలు, బ్రోచెస్, పెద్ద బటన్లు ఉన్న దుస్తులు ఎలాంటి లోహపు ఆభరణాలు వేసుకోకూడదు.

ధరించాల్సినవి: సాధారణ, సౌకర్యవంతమైన దుస్తులు (వీలైతే హాఫ్-స్లీవ్స్), షూస్‌కు బదులుగా సాధారణ చెప్పులు లేదా శాండల్స్ ధరించాలి.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026- నిషేధిత వస్తువుల జాబితా..

పరీక్ష హాల్లోకి ఈ కింది వస్తువులను తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధం ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.

ఎలక్ట్రానిక్ పరికరాలు: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ డివైజ్‌లు, ఇయర్‌ఫోన్లు, మైక్రోఫోన్లు, హెల్త్ బ్యాండ్‌లు, క్యాలిక్యులేటర్లు, పెన్ డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ పెన్నులు, కెమెరాలు, స్కానర్లు.

స్టేషనరీ వస్తువులు: జామెట్రీ బాక్సులు, పెన్సిల్ బాక్సులు, స్కేళ్లు, ఎరేజర్లు, లాగ్ టేబుల్స్, రైటింగ్ ప్యాడ్‌లు, ఎలాంటి ప్రింటెడ్ లేదా చేతితో రాసిన కాగితాలు.

ఇతర వస్తువులు: వాలెట్లు, హ్యాండ్‌బ్యాగులు, పౌచ్‌లు లోపలికి అనుమతించరు.

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2026- అభ్యర్థులకు మరికొన్ని ముఖ్య సూచనలు..

  • తాగే నీటిని కేవలం ట్రాన్స్​పరెంట్ బాటిళ్లలో మాత్రమే తెచ్చుకోవాలి.
  • పరీక్షా కేంద్రంలో తనిఖీలు, ఐడెంటిటీ వెరిఫికేషన్ సమయంలో అధికారులకు పూర్తిగా సహకరించాలి.
  • పరీక్ష ముగిసే లోపు ఇన్విజిలేటర్ అనుమతి లేకుండా సీటు వదిలి లేవకూడదు.

పరీక్షకు వెళ్లే ముందు ప్రశాంతంగా ఉండండి. ఈరోజు ఎలాంటి కొత్త అంశాలు చదవకుండా కేవలం ముఖ్యమైన ఫార్ములాలు మాత్రమే చూసుకోండి. అడ్మిట్ కార్డ్, ఐడీ ప్రూఫ్ ముందే సిద్ధం చేసుకుని, ఎగ్జామ్ సెంటర్‌కు నిర్ణీత సమయం కంటే ముందే చేరుకుని ఒత్తిడి లేకుండా పరీక్ష రాయండి.

దేశంలోనే అత్యంత కఠినమైన ఈ పరీక్షలో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రశాంత చిత్తంతో పేపర్ రాయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఆల్ ది బెస్ట్!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe