...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- మంకీ మాస్క్ పెట్టి హత్యలు- 8.2 రేటింగ్- 3 నెలలకు స్ట్రీమింగ్

OTT Telugu Crime Thriller Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కానిస్టేబుల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వరుణ్ సందేశ్ హీరోగా చేసిన ఈ సినిమాలో మంకీ మాస్క్ పెట్టి హత్యలు చేస్తుంటారు. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన కానిస్టేబుల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jan 29, 2026, 13:55:11 IST
Advertisement

ఓటీటీలోకి ప్రతి వారం ఎప్పటికప్పుడు సరికొత్తగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ముఖ్యంగా తెలుగులో వచ్చే సినిమాల కోసం ఓటీటీ ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. వారి కోసం అన్నట్లుగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సైతం డిఫరెంట్ జోనర్లలో సినిమాలను దింపుతుంటాయి.

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- మంకీ మాస్క్ పెట్టి హత్యలు- 8.2 రేటింగ్- 3 నెలలకు స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్- మంకీ మాస్క్ పెట్టి హత్యలు- 8.2 రేటింగ్- 3 నెలలకు స్ట్రీమింగ్

అలా ఈ వారం కూడా ఎన్నో ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ (జనవరి 29) ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే కానిస్టేబుల్. 2025లో వచ్చిన కానిస్టేబుల్ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా చేశాడు.

నయనం ఓటీటీ సిరీస్‌తో

గత కొంతకాలంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న వరుణ్ సందేశ్ డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్నాడు. మరోవైపు నయనం వంటి ఓటీటీ సిరీస్‌లతో సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ మూవీ గతేడాది థియేటర్లలో విడుదల అయింది.

వరుణ్ సందేశ్ భార్య కూడా

కానిస్టేబుల్ సినిమాలో వరుణ్ సందేశ్‌కు జోడీగా మధులిక వారణాసి హీరోయిన్‌గా చేసింది. ఈ ఇద్దరితోపాటు మురళిధర్ గౌడ్, పుష్ప ఫేమ్ కల్ప లత, రవి వర్మ, సూర్య, నిత్య శ్రీ, కశిష్ రాజ్‌పుత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా కానిస్టేబుల్ సినిమాలో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు కూడా యాక్ట్ చేయడం విశేషం.

కానిస్టేబుల్ రేటింగ్

కానిస్టేబుల్ సినిమా క్రైమ్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అంశాలతో సాగుతుంది. కాశీ (వరుణ్ సందేశ్) అనే కానిస్టేబుల్ ఓ ఊరులోకి కొత్తగా చేరుతాడు. ఆ గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. అయితే, వారిని మంకీ మాస్క్ పెట్టి మరి హత్యలు చేస్తుంటారు. గ్రామంలోని వివిధ చోట్లల్లో హత్యకు గురైన శవాలు బయటపడతాయి.

మంకీ మాస్క్ ఎందుకు

అసలు వారిని ఎవరు హత్య చేస్తున్నారు?, ఎందుకు చేస్తున్నారు?, హత్య చేసి తలలకు మంకీ మాస్క్ పెట్టడానికి గల కారణాలు ఏంటీ? ఆ హత్యలు ఎంతమంది చేస్తున్నారు? వారినే ఎందుకు చంపారు? కానిస్టేబుల్ కాశీ ఈ హత్యలను ఆపగలిగాడా? ఈ క్రమంలో కాశీ పోగొట్టుకుంది ఏంటీ? అనే అంశాలతో కానిస్టేబుల్ తెరకెక్కింది.

కానిస్టేబుల్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కానిస్టేబుల్ ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో కానిస్టేబుల్ ఓటీటీ రిలీజ్ అయింది. గతేడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన కానిస్టేబుల్ సినిమామ సుమారు 3 నెలలకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks