ఓటీటీలోకి ఎప్పుడు ఏ సినిమా వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ రిలీజ్ అవుతాయనుకుంటే దానికంటే ముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో దర్శనం ఇస్తుంటాయి. కొన్ని నెలలు గడిచిన ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావు.
ఓటీటీ ఆడియెన్స్ ఇంట్రెస్ట్

ఇక కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి అంటే వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన విషయాలపై తెగ ఆసక్తి చూపిస్తుంటారు ఓటీటీ ఆడియెన్స్. అలా ఇప్పుడు రెండు సినిమాలపై ఓటీటీ ప్రేక్షకులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవే తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు.
తెలుసు కదా డైరెక్టర్
సిద్ధు జొన్నలగడ్డ జాక్ తర్వాత నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తెలుసు కదా. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలి అవతారం ఎత్తిన ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 17న థియేటర్లలోకి వచ్చిన తెలుసు కదా ఓటీటీ రైట్స్ రిలీజ్‌కు ముందే అమ్ముడు పోయాయి.
తెలుసు కదా బడ్జెట్
ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన తెలుసు కదా సినిమాకు రూ. 45 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు సమాచారం. అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే తెలుసు కదా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెలుసు కదా ఓటీటీ హక్కులను సుమారుగా రూ. 22 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
తెలుసు కదా ఓటీటీ ప్లాట్‌ఫామ్
కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లోనే తెలుసు కదా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సినిమాకు వచ్చే టాక్, కలెక్షన్స్, థియేట్రికల్ రన్ అన్నింటిని దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్‌లో తెలుసు కదాను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
డ్యూడ్గా ప్రదీప్
{{/usCountry}}కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లోనే తెలుసు కదా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సినిమాకు వచ్చే టాక్, కలెక్షన్స్, థియేట్రికల్ రన్ అన్నింటిని దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్‌లో తెలుసు కదాను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
డ్యూడ్గా ప్రదీప్
{{/usCountry}}లవ్ టుడే, డ్రాగన్ వంటి సూపర్ హిట్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన నయా సినిమా డ్యూడ్. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో కూడా ఇద్దరు ముద్దుగుమ్మలు మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా చేశారు.
డ్యూడ్ బడ్జెట్
నిన్న అంటే అక్టోబర్ 17న తెలుసు కదా సినిమాతో పాటు బాక్సాఫీస్ పోటీకి దిగిన డ్యూడ్ కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన డ్యూడ్ ఓటీటీ రైట్స్ కూడా సేల్ అయిపోయాయి. తెలుసు కదా సినిమాను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ డ్యూడ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.
డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్
దాదాపుగా రూ. 25 కోట్లు వెచ్చించి డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుందని సమాచారం. కాబట్టి, టాక్, కలెక్షన్స్, థియేట్రికల్ రన్ అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత డ్యూడ్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ ప్రీమియర్ కానుంది. ఇలా నిన్న థియేట్రికల్ రిలీజ్ అయిన రెండు సినిమాలు ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.